Yandamuri Veerendhranath : తెలుగులో నవలా రచయితగా ఎన్నో ఫేమస్ నవలలను రాసిన వ్యక్తి యండమూరి గారు. వెన్నెల్లో ఆడపిల్ల, రాక్షసుడు, మరణ మృదంగం, తులసీ దళం వంటి ఎన్నో నవలను రాసిన ఆయన అప్పట్లో పాఠకులను ఆయన కలంతో ప్రభావితం చేశారు. ఆయన ఎన్నో నవలలు సినిమాలుగా వచ్చి హిట్ అందుకున్నాయి. ఇక వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఎన్నో ఉపన్యాసాలను ఆయన పలు విద్యాసంస్థల్లో ఇస్తూ ఎంతో మందిని ప్రభావతం చేశారు. ఇక సినిమాల్లో కథను అందిచ్చేవరకే నా పాత్ర ఇక సినిమాకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ చెప్పే యండమూరి గారు పలు అంశాల మీద తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఆ రెండు సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణం…
ఒక సినిమాకు కథ ఇవ్వడం వరకే నా పని ఆ తరువాత ఆ డైరెక్టర్ హీరోకి తగ్గట్టు సినిమాను ఎలా మార్చినా నాకు సంబంధం లేదు. నేను ఇక వేలు పెట్టాను అంటూ చెప్పే యండమూరి వీరేంద్రనాథ్ గారు సినిమాల హిట్లు ఫ్లాపుల గురించి మాట్లాడుతూ ఆచార్య సినిమా ఫ్లాప్ అవడానికి కారణం చిరంజీవిని నక్సలైట్ గా ప్రేక్షకులు చూడకపోవడం అంతే కానీ సినిమా తీసిన కొరటాల శివ తప్పు కాదు.
ఆచార్య సినిమా కంటే ముందు ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు హిట్ అయినపుడు ఈ సినిమా కూడా అలానే డైరెక్ట్ చేసుంటాడు కాకపోతే ప్రేక్షకులు కోరుకున్న అంశం ఆ సినిమాలో లేకపోవడం వల్ల సినిమా పోయిండవచ్చు. ఇక అజ్ఞాతవాసి సినిమా కూడా అంతే అంతకుముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు హిట్స్ ఉన్నాయి ఈ సినిమానే పోయింది. దానికి డైరెక్టర్ తప్పు ఏమి లేదు కేవలం, ప్రేక్షకులకు నచ్చలేదు అంతే అంటూ తెలిపారు.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…