Categories: FeaturedMovie News

Yandamuri Veerendranath : చిరంజీవి కోసం కథ రాస్తే ఏముంది ఆ కథలో అంటూ అవమానించారు… అదే కథ రాఘవేంద్ర రావు నాగార్జునతో చేసారు: యండమూరి వీరేంద్రనాథ్

Yandamuri Veerendranath : నవలా రచయితగా సుపరిచితులైన యండమూరి సినిమా రంగంలో కూడా పనిచేసారు. ఆయన రాసిన అనేక నవలలు సినిమాలుగా వచ్చి తెలుగు ప్రేక్షకులను అలరించాయి. తెలుగులో పలు సినిమాలు, సీరియల్స్ కు కథ అందించిన యండమూరి గారు నంది అవార్డులు కూడా అందుకున్నారు. ఇక కన్నడ లో కూడా కొన్ని సినిమాలకు కథలు అందించారు. ఆయన చిరంజీవి కాంబినేషన్ లో అభిలాష, జగదేక వీరుడు అతిలోక సుందరి, ఛాలెంజ్ వంటి హిట్ సినిమాలు ఉన్నాయి.

చిరంజీవికి ఆ కథ సరిపోదని అవమానించారు..

తాజాగా ఒక ఇంటర్వ్యూలో యండమూరి గారు ఒక సినిమా కథ విషయంలో జరిగిన సంఘటన వివరించారు. యండమూరి గారు ఏ కథ రాసినా అది చిరంజీవిగారిని దృష్టిలో పెట్టుకుని రాసేవారట. అలానే ఒక కథ కోదండ రామిరెడ్డి అడిగితే చిరంజీవి కాంబినేషన్ లో సినిమా కోసం ఆయన సిద్ధం చేశారట. మరి కొద్దిరోజుల్లో సినిమా ముహూర్తం అనుకునే సమయానికి, ఏమి చెప్పకుండా కోదండ రామి రెడ్డి గారు గొల్లపూడి మారుతీ రావు గారి కథతో సినిమా చేస్తున్నట్లు పత్రికలో రావడం చూసి బాగా బాధపడ్డారట. అదే సమయానికి అశ్వినిదత్ వచ్చి కథ అడుగగా చిరాకుగా ఉన్నానని కోదండ రామి రెడ్డి ఒక మాటైనా చెప్పకుండా వేరే సినిమా చేస్తున్నారు అని అన్నారట. ఏడేళ్ల నుండి ప్రయాణిస్తున్నాం ఇద్దరూ ఇలా చెప్పకుండా చేస్తారా మరి ఇంత కమర్షియల్ గానా అని చిరాకుపడ్డారట యండమూరి.

ఇక వెంటనే ఆ కథను అశ్విని దత్ కు చూపించగా, ఆయన కూడా ఈ కథ చిరంజీవికి సరిపోదు కదా అన్నారట. పక్కనే అన్నపూర్ణ స్టూడియోలో రాఘవేంద్ర రావు ఉండగా ఆయనను కలిసి కథ చూపించగా ఆయన కూడా అదే మాట అన్నారట. ఈ కథలో హీరోకి పెద్దగా ఇమేజ్ లేదు ఈ కథ చిరంజీవికి నప్పదు అని చెప్పారట. అయితే కథ బాగా నచ్చింది ఒక కొత్త కుర్రాడితో సినిమాలు చేద్దాం అని అన్నారట. ఎవరితో అన్నపుడు నాగార్జున అయితే బాగుంటుందని అనుకున్నారు. ఇక హీరోయిన్ పాత్ర చాలా కీలకం సిబిఐ ఆఫీసర్ గా ఉండే పవర్ ఫుల్ పాత్రకి ఎవరైతే బాగుంటుందని అలోచించి శ్రీదేవిని తీసుకుందామనుకున్నారట. నాగేశ్వరావు గారితో చేసింది మళ్ళీ నాగార్జున తో ఎలా అని సంశయించినా, శ్రీదేవి అయితే ఆ పవర్ ఫుల్ రోల్ కి బాగుంటుందని ఎంపిక చేసారు. ఇక కథలో చిన్న మార్పులు చేసి సుహాసిని పాత్రను పెట్టారట. అలా చిరంజీవి కోసం రాసిన కథ నాగార్జున తీసిన ‘ఆఖరి పోరాటం’ సినిమాగా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆతరువాత రాఘవేంద్ర రావు తో కూడా కొన్ని సినిమాలు చేశారట యండమూరి.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago