Yandamuri Veerendranath: లెజెండ్రీ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గురించి పరిచయం అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవితో ఆయనకి ఒకప్పుడు మంచి సాన్నిహిత్యం ఉండేది. ఆ తర్వాత ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చాయి. దీనితో చాలా కాలంగా వీరిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఇటీవల వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించిన సంగతి తెలిసిందే.
ఇలా ఒకే వేదికపై చిరంజీవి యండమూరి కనిపించడమే కాకుండా ఇద్దరు కూడా ఎంతో ప్రేమగా మాట్లాడారు. అంతేకాకుండా చిరంజీవి తన బయోగ్రఫీ రాసే బాధ్యత యండమూరి గారికి ఇస్తున్నారని కూడా తెలియజేశారు. ఈ విషయం గురించి యండమూరి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా చిరంజీవి గురించి యండమూరి మాట్లాడుతూ మా ఇద్దరి మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు లాంటివి ఎన్ని సార్లు గొడవ పడిన తిరిగి మాట్లాడుతాము అంటూ ఈయన తెలిపారు. మేము కూడా అంతే. ఆ రోజు వేదికపై చిరంజీవి గారు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే చిన్న భయం ఉండేది. కానీ ఆయన కళ్ళల్లో ప్రేమ కనిపించిందని యండమూరి అన్నారు.
నేనే అడిగాను…
మీ జీవిత చరిత్ర రాస్తే బావుంటుందని నేనే ఆయనతో అన్నాను. అవునా మీరు రాస్తే అంతకంటే కావలసింది ఏముందని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని యండమూరి అన్నారు. యండమూరి రచించిన అభిలాష, ఛాలెంజ్ లాంటి నవలల ఆధారంగా తెరకెక్కిన చిత్రాల్లో చిరు నటించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…