Categories: FeaturedMovie News

Mrunal Thakur: పల్లెటూరు అమ్మాయి అంటూ అవమానించారు.. మృణాల్ కామెంట్స్ వైరల్!

Mrunal Thakur: మరాఠీ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈమె బుల్లితెర సీరియల్స్ నటిస్తూ అనంతరం మరాఠీ సినిమాలలో అవకాశాలు అందుకున్నారు. ఇలా మరాఠీ సినిమాలలో నటిస్తూనే బాలీవుడ్ చిత్రాలలో కూడా అవకాశం అందుకున్నటువంటి ఈమె బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు. అయితే తెలుగులో కూడా సీతారామం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైనటువంటి మృణాల్ వెండితెర సీతమ్మగా తెలుగు ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయారు. ఇక ఈ సినిమా తర్వాత తెలుగులో కూడా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. ఇలా ఊహించని విధంగా తెలుగులో అభిమానాన్ని సొంతం చేసుకున్నటువంటి ఈమె ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీ అయ్యారు.

ఇదిలా ఉండగా తాజాగా మృణాల్ ఠాగూర్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈమె ఒకానొక సమయంలో తీవ్రమైనటువంటి బాడీ షేమింగ్ ట్రోల్స్ ఎదుర్కొన్నానని నన్ను చాలామంది అవమానింపజేశారు అంటూ కామెంట్లు చేశారు.

బరువు తగ్గమని సలహా ఇచ్చారు..

తాను అవకాశాల కోసం స్టూడియోలకు వెళ్తే నేను అసలు సెక్సీగా లేనని, పల్లెటూరు అమ్మాయి అంటూ దారుణంగా అవమానించారు మరి కొంతమంది మీరు కాస్త బరువు తగ్గండి అంటూ కూడా నాకు సలహాలు ఇచ్చారని తెలిపారు. ఇవన్నీ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎదుర్కొందని తెలిపింది. ఆ అనుభవాలను, ఆయా సందర్భాల్లో తనను ఉద్దేశించిన కామెంట్స్ ను వివరించింది. 

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago