Yendamuri Veerendranath: సినీ రచయితగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యండమూరి వీరేంద్రనాథ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి సినిమాల గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ సినీ కెరీర్లో ఎంతో మంచి విజయాన్ని అందుకున్న సినిమాలలో జగదేక వీరుడు అతిలోక సుందరి ఒకటి. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే.
ఇక తాజాగా యండమూరి వీరేంద్రనాథ్ ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ సినిమా ఒక్కొక్కరి నుంచి ఒక్కో ఆలోచన తీసుకొని తెరకెక్కించాము. ఇలా అందరి ఆలోచనలు కరెక్ట్ గా వర్కౌట్ కావడంతో ఈ సినిమా మంచి విజయం అందుకుందని యండమూరి ఈ సందర్భంగా వెల్లడించారు.
ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి శ్రీదేవి కలుసుకునే సన్నివేశం కోసం పెద్ద చర్చ జరిగింది. చిరంజీవి దగ్గర నలుగురు పిల్లలు ఉంటారు. వీరిలో ఒక అమ్మాయికి వైద్యం చేయించడం కోసం డబ్బు అవసరమవుతుంది. అయితే అప్పట్లో చంద్రమండలంలోకి వెళ్లే వారికి డబ్బులు ఇస్తామని ప్రకటిస్తారు. చిరంజీవిని చంద్రమండలంలోకి పంపించి అక్కడ శ్రీదేవి చిరంజీవిని కలపాలని ప్లాన్ చేశారు.
ఇక ఈ విషయంపై చిరంజీవి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చంద్రమండలంలోకి వెళ్లి హీరోయిని కలుసుకోవడం ఏంటి? చంద్ర మండలంలో రాళ్ళు రప్పలు తప్ప ఇంకేం ఉంటాయి అక్కడ కలుసుకోవడం ఏంటి? మూలికల కోసం హిమాలయాలకు వెళ్ళినపుడు అక్కడ కలుసుకొనేలా ఉంటే బాగుంటుందని చిరంజీవి గారు చెప్పారు. ఇక ఆ మాట విన్న రాఘవేంద్రరావు ఈ ఆలోచన బాగుందని, అదే సీన్ పెట్టారని, యండమూరి ఈ సందర్భంగా జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా గురించి ఈ విషయాన్ని బయటపెట్టారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…