వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోమారు సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోటీ చేసి రెండు లక్షల మెజారిటీతో గెలుస్తానని ఆయన అన్నారు. గత కొంత కాలం నుంచి జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న రఘురామ కృష్ణంరాజును పార్లమెంట్ లెజిస్లేటివ్ సబార్డినేట్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తొలగించినట్టు సోషల్, వెబ్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.
వైరల్ అవుతున్న వార్తల గురించి రఘురామ కృష్ణంరాజు స్పందిస్తూ లోక్ సభ స్పీకర్ కు వైసీపీ ఎంపీలు మూడు నెలల క్రితమే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని లేఖ ఇచ్చారని.. అయితే అది ఏడాది పదవి కావడంతో తొలగించడం సాధ్యం కాదని ఆయన చెప్పారని తెలిపారు. తన ఏడాది పదవీకాలం పూర్తైందని.. అందువల్ల ఎంపీ బాలశౌరికి పదవి దక్కిందని రఘురామ చెప్పుకొచ్చారు.
త్వరలో తనపై అనర్హత వేటు వేస్తామని కొందరు నేతలు చెబుతున్నారని.. అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుందని తాను ఎన్నికలకు వెళితే జగన్ పైనే 2 లక్షలకు పైగా మెజారిటీతో గెలుస్తానని తెలిపారు. తనను ఎవరూ పదవి నుంచి తొలగించలేరని.. జగన్ కు దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలంటూ సవాల్ విసిరారు. తాను జగన్ పై గెలుస్తానంటూ చేసిన వ్యాఖ్యలు అతిశయోక్తితో చెప్పినవి కాదని పేర్కొన్నారు.
బాలశౌరి సీఎం జగన్ మతానికి చెందిన వారు కాబట్టే ఆయనకు పదవి దక్కిందని.. ఆ పదవిని జగన్ బాలశౌరికి ముష్టి వేశారని చెప్పుకొచ్చారు. ఈ విషయాలేవీ సరిగ్గా తెలియని వైసీపీ సోషల్ మీడియా మాత్రం సంబరాలు చేసుకుంటోందని తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…