వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోమారు సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోటీ చేసి రెండు లక్షల మెజారిటీతో గెలుస్తానని ఆయన అన్నారు. గత కొంత కాలం నుంచి జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న రఘురామ కృష్ణంరాజును పార్లమెంట్ లెజిస్లేటివ్ సబార్డినేట్ కమిటీ చైర్మన్‌ పదవి నుంచి తొలగించినట్టు సోషల్, వెబ్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.

వైరల్ అవుతున్న వార్తల గురించి రఘురామ కృష్ణంరాజు స్పందిస్తూ లోక్ సభ స్పీకర్ కు వైసీపీ ఎంపీలు మూడు నెలల క్రితమే పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ పదవి నుంచి తొలగించాలని లేఖ ఇచ్చారని.. అయితే అది ఏడాది పదవి కావడంతో తొలగించడం సాధ్యం కాదని ఆయన చెప్పారని తెలిపారు. తన ఏడాది పదవీకాలం పూర్తైందని.. అందువల్ల ఎంపీ బాలశౌరికి పదవి దక్కిందని రఘురామ చెప్పుకొచ్చారు.

త్వరలో తనపై అనర్హత వేటు వేస్తామని కొందరు నేతలు చెబుతున్నారని.. అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుందని తాను ఎన్నికలకు వెళితే జగన్ పైనే 2 లక్షలకు పైగా మెజారిటీతో గెలుస్తానని తెలిపారు. తనను ఎవరూ పదవి నుంచి తొలగించలేరని.. జగన్ కు దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలంటూ సవాల్ విసిరారు. తాను జగన్ పై గెలుస్తానంటూ చేసిన వ్యాఖ్యలు అతిశయోక్తితో చెప్పినవి కాదని పేర్కొన్నారు.

బాలశౌరి సీఎం జగన్ మతానికి చెందిన వారు కాబట్టే ఆయనకు పదవి దక్కిందని.. ఆ పదవిని జగన్ బాలశౌరికి ముష్టి వేశారని చెప్పుకొచ్చారు. ఈ విషయాలేవీ సరిగ్గా తెలియని వైసీపీ సోషల్ మీడియా మాత్రం సంబరాలు చేసుకుంటోందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here