Featured

Yedu Kondalu : నేనే సుధీర్ ని పిలిచి జబర్దస్త్ లో ఛాన్స్ ఇచ్చా.. ఇపుడు ఫోన్ చేస్తే లిప్ట్ చేయడు : ఏడు కొండలు

Yedu Kondalu : జబర్దస్త్ నుండి బయటికి వెళ్లిన చాలా రోజులకు కిర్రాక్ ఆర్పి మల్లెమాల సంస్థ గురించి, జబర్దస్త్ గురించి తీవ్ర విమర్శలు చేసాడు. ప్రధానంగా తిండి గురించి, అక్కడ గౌరవం ఇవ్వరు అంటూ ఆరోపణలు చేసాడు. ఇక ఈ కామెంట్స్ కు జబర్దస్త్ నుండి వచ్చిన రామ్ ప్రసాద్, హైపర్ ఆది వివరణ ఇచ్చారు. అయినా కూడా వివాదం సద్దుమనగలేదు, షేకింగ్ శేషు కిర్రాక్ ఆర్పి ని వ్యక్తిగతంగా కామెంట్స్ చేయడం వల్ల వివాదం ముదిరింది. ఇక కిర్రాక్ ఆర్పి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు తన తండ్రి జయంతి, వర్ధంతి కూడా జరపరు అంటూ కామెంట్స్ చేయడం షేకింగ్ శేషుని దూషించడంతో ఇక ఈ ఇష్యూ మరింత వైరల్ గా మారింది. కాగా తాజాగా జబర్దస్త్ ముందు మేనేజర్ ఏడు కొండలు యూట్యూబ్ లో ఇంటర్వ్యూ ఇచ్చి వివాదాన్ని ఇంట్రస్టింగ్ గా మార్చారు.

సుధీర్ అపుడు అలా… ఇప్పుడు ఇలా…

జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ కి ఉన్న క్రేజ్ మరే ఇతర కమెడియన్ కి లేదు. అందరికన్నా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ తో సుధీర్ జబర్దస్త్ లోనే కాకుండా ఢీ, పోవే పోరా, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలా అన్నింట్లో హోస్టింగ్ అలాగే ఈవెంట్లు అంటూ ఈటీవీలో కనిపించాడు. సుధీర్ కి సినిమా అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. అయితే ఇపుడు సుధీర్ ఈటీవీలో ఏ షోలోనూ లేడు. చివరకు జబర్దస్త్ కూడా వదిలేసి ఇప్పుడు మా టీవీ లో ప్రసారమయ్యే కొన్ని షో లకు హోస్ట్ గా చేస్తున్నాడు. అయితే సుధీర్ జబర్దస్త్ గురించి గాని మల్లెమాల గురించి కానీ ఎటువంటి విమర్శలు చేయలేదు. అయితే జబర్దస్త్ కి మేనేజర్ గా మల్లెమాల సంస్థలో ఎప్పటి నుండో పని చేసి బయటకు వెళ్లిపోయిన ఏడు కొండలు తాజాగా యూట్యూబ్ లో ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. జబర్దస్త్ కోసం ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు, వీళ్ళు వచ్చి మా వల్ల జబర్దస్త్ కి పేరోచ్చింది అంటున్నారు. ఏ ఒక్కడి వల్లో జబర్దస్త్ ఎంత పెద్ద హిట్ అవ్వలేదు, అందరి కష్టం ఉంది. ప్రొడక్షన్ లో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో వాళ్లకు తెలుసా తిండి బాగోలేదు అంటున్నారు, సంస్థలో ఎప్పుడూ భోజనం బాగానే పెట్టాము. ఒక్కోసారి వీళ్ళు పది మందిని తీసుకుని వచ్చిన అన్నం పెట్టాము. నీకు బ్రతుకునిచ్చిన సంస్థ గురించి మాట్లాడకూడదు అంటూ అన్నారు.

సుధీర్ ఫోన్ చేసినా లిప్ట్ చేయడు ఇప్పుడు. ఒకప్పుడు నేనే తనను పిలిచి జబర్దస్త్ అవకాశం ఇప్పించాను కానీ ఇప్పుడు తాను నా ఫోన్ కూడా ఎత్తడు. సినిమాల్లో బిజీ అంటారు ఎన్ని సినిమాలు సుధీర్ వి హిట్ అయ్యాయో తెలియవా అంటూ ప్రశ్నించారు. ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం సుధీర్ కి ఫోన్ చేస్తే తన మేనేజర్ తో మాట్లాడమని చెప్పాడు అంటూ ఇంటర్వ్యూ మధ్యలోనే సుధీర్ కి ఫోన్ చేసి నా కాల్ లిప్ట్ చేయడు అంటూ చేసి చూపించారు. కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చి కొంచెం డబ్బులు సంపాదించుకుంటేనే పెద్ద సెలబ్రిటీలు అంటూ ఫీల్ అయిపోతారు అంటూ విమర్శించారు ఏడుకొండలు.

Bhargavi

Recent Posts

ప్రేమించి పెళ్లి… చివరకు భర్త హత్య! హోలోగ్రామ్‌తో బయటపడిన షాకింగ్ కుట్ర

ప్రేమతో మొదలైన ఒక బంధం చివరకు నేరంగా మారిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపుతోంది. మొదట చూసిన వారికి…

4 hours ago

అషు రెడ్డి-టెక్కీ వివాదంలో ఆడియో బాంబ్

బిగ్‌బాస్ ఫేమ్ అషు రెడ్డి, టెక్కీ ధర్మేంద్ర మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. పెళ్లి…

4 hours ago

ఒక్క ఛాన్స్ కోసం తిరిగిన సత్యరాజ్.. కట్టప్పగా వరల్డ్ ఫేమ్

దక్షిణ భారత సినీ ప్రపంచంలో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యరాజ్ ప్రయాణం ఎంతో కష్టసాధ్యంగా సాగింది. నేటి…

4 hours ago

“ఆ హీరో నా జీవితంలో గాడ్ ఫాదర్”.. అనుష్క ఎమోషనల్ కామెంట్స్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అనుష్క శెట్టి తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా…

4 hours ago

“వినాశకాలే విపరీత బుద్ధి”.. యువతకు కఠిన హెచ్చరిక

ప్రమాదకర బైక్ స్టంట్లపై హైదరాబాద్ పోలీసులు మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ వి. సి.…

5 hours ago

మోదీని డైరెక్ట్‌గా కలుస్తా.. మంచు లక్ష్మి రాజకీయ వ్యాఖ్యలు వైరల్

టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి రాజకీయ ప్రవేశంపై చేసిన తాజా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.…

6 hours ago