Trivikram Srinivas: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఇలా సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా రచయితగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ సొంత గ్రామం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఉన్న కాళ్ళకూరు. అయితే ఈయన అప్పుడప్పుడు తన సొంత గ్రామానికి వెళుతూ ఉంటారు ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ఉన్నఫలంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తన భార్య సౌజన్యతో కలిసి సొంత గ్రామానికి వెళ్లారు.
ఈ విధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తన భార్యతో కలిసి తన సొంత గ్రామమైన కాళ్ళకూరు వెళ్లడానికి కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. ఈ గ్రామంలో స్వయంభుగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనార్థం త్రివిక్రమ్ శ్రీనివాస్ దంపతులు తమ సొంత గ్రామానికి వెళ్లారని తెలుస్తుంది. గురు పౌర్ణమి సందర్భంగా త్రివిక్రమ్ దంపతులు సొంత గ్రామానికి వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నారు.
ఇకపోతే త్రివిక్రమ్ దంపతులు స్వామివారి దర్శనార్థం ఆలయానికి వెళ్ళగా ఆలయ పండితులు ఈ దంపతులను సాదరంగా ఆహ్వానించి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఈ దంపతులను సత్కరించి స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఇకపోతే ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ గురు పూర్ణిమ సందర్భంగా ఇలా తమ సొంత గ్రామంలో వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
ఇకపోతే తాను ప్రతిఏటా స్వామి వారి దర్శనార్థం తన సొంత గ్రామానికి వస్తానని ఈ సందర్భంగా త్రివిక్రమ్ పేర్కొన్నారు.త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల విషయానికి వస్తే ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన అలా వైకుంఠపురం సినిమా ద్వారా మంచి హిట్ కొట్టిన శ్రీనివాస్ ఇప్పటివరకు ఎలాంటి సినిమాలకు దర్శకత్వం వహించలేదు. ఇకపోతే పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాకి దర్శక పర్యవేక్షకుడిగా బాధ్యతలు తీసుకున్నారు.త్వరలోనే మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుంది ఈ సినిమా ఆగస్టు 2వ వారం నుంచి షూటింగ్ పనులు జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…