Yemaya Chesave 2: గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సమంత నాగచైతన్య జంటగా నటించిన చిత్రం ఏం మాయ చేసావే. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిన మనకు తెలిసిందే. సమంత మొట్టమొదటి సినిమాని బ్లాక్ బస్టర్ కావడమే కాకుండా ఈ సినిమా చూసిన తర్వాత ఎంతోమంది స్టార్స్ ప్రేమలో పడ్డారు.
ఇక ఈ సినిమా సమయంలోనే సమంత నాగచైతన్య మధ్య ప్రేమ ఏర్పడటం ఆ ప్రేమ పెళ్లి వరకు దారి తీయడం జరిగింది. ఇలా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నటువంటి సమంత నాగచైతన్య కొన్ని కారణాలవల్ల విడిపోయారు. అయితే తాజాగా ఏం మాయ చేసావే సినిమా సీక్వెల్ చిత్రం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది అంటూ గౌతమ్ మీనన్ ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో తెలియజేశారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని ఈయన తెలిపారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త చెక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో సమంత నాగచైతన్య ఇద్దరు విడిపోయిన తర్వాత వారి జీవితంలో ఎలాంటి స్ట్రగుల్స్ ఎదుర్కొన్నారు అనే కథాంశంతో స్క్రిప్ట్ సిద్ధం చేశారని వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా కాకుండా సమంత స్థానంలో రష్మిక నటించబోతుందని తెలుస్తోంది. ఇలా రష్మిక ఈ సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్నట్లు సమాచారం.ఏది ఏమైనా ఏ మాయ చేసావే సినిమాలో కలిసి నటించి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నటువంటి సమంత నాగచైతన్య విడిపోవడం అందరిని చాలా ఆశ్చర్యానికి గురిచేసింది.ఇక సినిమాలో కూడా వీరిద్దరూ విడిపోయినట్లు చూపించబోతున్నారని తెలియడంతో ఈ సినిమాపై కూడా ఆసక్తి నెలకొంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…