అమ్మాయిలకు నెలసరి ప్రతి నెల వస్తూనే ఉంటుంది. అప్పుడు వారు పడే బాధ వర్ణనాతీతం. రక్తస్రావం అవుతున్న సమయంలో వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంతే కాకుండా దానికి తోడు కడుపులో నొప్పి వస్తుంది. కొంత మందికి అయితే భరించలేని నొప్పి వస్తుంది. ఇది కాకుండా రోజులో రక్తస్రావం అయ్యే దాన్ని బట్టి పాడ్ మార్చుకోవడం, అది ఎక్కడ బట్టలకు మరకలు పడుతుందో అని టెన్షన్ ఎన్నో భయాలు ప్రతి ఒక్క అమ్మాయికి ఇంచు మించు ఇలానే ఉంటుంది ప్రతి నెల..
ఇపుడు అయితే సానిటరీ నాప్ కిన్ స్ వచ్చాయి కానీ ఇంతకు ముందు క్లాత్ ని ఉపయోగించేవారు. దాని వల్ల దురద, మంట, దుర్వాసన మరియు ఇన్ఫెక్షన్స్ వంటివి వచ్చేవి. దాని వల్ల ఇబ్బందులు వస్తున్నాయనే శానిటరీ నాప్ కిన్ లను వాడుకులోకి తెచ్చారు. కానీ వీటికి దుర్వాసన రాకుండా ఉండేందుకు రసాయనాలను వాడడం వల్ల యోని మార్గం వద్ద దురద, నల్లగా మారడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యల వల్ల కొంత మంది టాంపున్స్ వాడుతున్నారు. కానీ ఇవి రక్తస్రావాన్ని కాకుండా యోనిలో ఉండే సహజ ద్రవాలను కూడా పీల్చేస్తున్నాయి. దాని వల్ల పీ హెచ్ స్థాయిలలో కూడా తేడాలు వస్తున్నాయి.
దీనికి పరిష్కారంగా Menstrual కప్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటి వల్ల ఎటువంటి సమస్యలు రావని వైద్యులు చెపుతున్నారు. శానిటరీ నాప్కిన్స్ ని ఒకసారి వాడి పడేస్తారు. మళ్లీ ఉపయోగించుకోవడానికి పనికి రావు. ఈ Menstrual కప్స్ మాత్రం తిరిగి వాడుకోవచ్చు. ఇవి ఎక్కువ రక్తస్రావాన్ని కూడా నిల్వ చేస్తుంది. వీటిని శుభ్రం చేసుకొని కొన్ని సంవ్సరాలపాటు వినియోగించ వచ్చు. ఎక్కువ రక్తస్రావం అయ్యే సమయంలో మరియు బైటకు వెళ్ళిన పుడు వీటిని వాడటం ఉత్తమం అని డాక్టర్లు సూచిస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…