బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు హాట్ టాపిక్ గా మారడమే కాకుండా సింగర్ హనీ సింగ్ వ్యవహారం కూడా ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. హనీ సింగ్ తనని లైంగికంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అంటూ తన భార్య షాలినీ తల్వార్ మంగళవారం తన భర్త హనీ సింగ్ పై తిస్ హజారీ కోర్టులో ‘గృహ హింస నుంచి మహిళల రక్షణ చట్టం’ కింద పిటీషన్ దాఖలు చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే గృహ హింస నుంచి మహిళల రక్షణ చట్టం కింద ఆమె తన భర్త నుంచి పది కోట్ల రూపాయల పరిహారం కోరినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోన తల్వార్ తెలుపుతూ మాట్లాడుతూ.. జనవరి 23 2011 న వీరి వివాహం జరిగిందని, గత 10 సంవత్సరాల కాలం నుంచి హనీ సింగ్ తనని ఏ విధమైనటువంటి మానసిక హింసలకు గురి చేశాడనే ఈ విషయాలను తన పిటిషన్లో పేర్కొంది.
ఈ క్రమంలోనే తన భర్తకు చాలా మంది మహిళలతో అక్రమ సంబంధం ఉందని, అందుకోసమే తనపై ఈ విధంగా దాడి చేస్తున్నారని ఆరోపించారు. కేవలం తన భర్త మాత్రమే కాకుండా తన మామ కూడా తనతో ఎంతో అసభ్యంగా ప్రవర్తించే వారని ఒకరోజు ఫుల్లుగా మద్యం సేవించి తన గదిలోకి వచ్చి తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించింది.
ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి స్థాయిలో ఉన్న హనీ సింగ్ పై తన భార్య ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయడంతో తన లైఫ్ చిక్కులలో పడిందని చెప్పవచ్చు. హనీ సింగ్ పై తల్వార్ చేస్తున్న ఆరోపణలు ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…