Supritha: మాకు బట్టలు మీరు కొనివ్వలేదుగా... మరెందుకో అంత ఆసక్తి.. నెటిజన్స్ పై సుప్రీత ఫైర్!
Supritha: ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సినిమాలలో నటిస్తూ తల్లి, అక్క, వదిన పాత్రల ద్వారా మనందరికీ సుపరిచితమైన సురేఖ వాణి గత కొంతకాలంగా సినిమాలలో తన స్పీడు తగ్గించింది. సురేఖ వాణి తన భర్త చనిపోయిన తర్వాత ఎక్కువ సినిమాలు చేయటం లేదు. ఇలా సినిమాలలో తక్కువగా కనిపిస్తున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.
సురేఖవాణి తన కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. వీరిద్దరూ తల్లి కుతుర్లలా కాకుండా స్నేహితులలా కనిపిస్తారు .సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ ఫోటోలతో పాటు వీడియోస్ కూడా షేర్ చేస్తూ ఉంటారు. సురేఖ వాణి కూతురు కూడ ఇప్పుడు ఒక సినిమాలో చిన్న పాత్రలో నటిస్తున్నారు . వీరిద్దరూ సరదాగా వెకేషన్స్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు .ఈ క్రమంలో వారు వేసుకునే బట్టల గురించి ఎన్నోసార్లు విమర్శలు ఎదుర్కొన్నారు.
సురేఖ వాణి కూడా తన కూతురికి పోటీగా పొట్టి పొట్టి బట్టలు వేసుకొని డాన్సులు చేస్తూ సందడి చేస్తోంది. అందువల్ల మీ కూతురు బదులు మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా వారి గురించి నెగెటివ్ కామెంట్స్ చేస్తున్న వారి మీద సుప్రీత విరుచుకుపడింది .ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుప్రిత తమని ట్రోల్ చేస్తున్న వారికి గట్టి సమాధానం ఇచ్చారు.
ఈ సందర్భంగా సుప్రీత స్పందిస్తూ….“మా బట్టలు మా ఇష్టం .. మీ డబ్బులతో మీరు ఏమైనా కొని ఇస్తున్నారా? మా బ్రతుకు మేము బ్రతుకుతున్నాము. మీ నుండి మేము ఏమైనా ఆశిస్తున్నామా? మీ పని మీరు చూసుకోకుండా మాపై మీకెందుకు అంత ఆసక్తి అంటూ గట్టిగా సమాధానం చెప్పింది. నా తండ్రి చనిపోయాడన్న బాధ నుంచి అమ్మను బయటకు తీసుకురావటానికి ప్రయత్నాలు చేస్తుంటే మీరు మాత్రం మీకు తోచినట్టు మాట్లాడుతున్నారు. ఈరోజు మా గురించి ఇలా కామెంట్స్ చేసేవారు.. రేపు మాకు కష్టాలు వస్తే ఎవరైనా సాయం చేస్తారా? మరి అలాంటి వాళ్లు మా గురించి ఇలా ఎందుకు మాట్లాడాలి? అంటూ సుప్రిత నెజిజన్లపై విరుచుకుపడింది .
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…