Anchor Anasuya : ప్రముఖ బుల్లితెర యాంకర్ అనసూయ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందరి లాగే అనసూయ కూడా జబర్దస్త్ కి దూరం కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గత 9 సంవత్సరాలుగా బుల్లితెర మీద ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వారిలో అనసూయ కూడా ఉంది.
ఈ షో ద్వారా అనసూయ యాంకర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా ఆర్థికంగా కూడా బాగా నిలదొక్కుకుంది. జబర్దస్త్ ద్వారా యాంకర్ గా పాపులర్ అవ్వటంతో అనసూయకు సినిమాలలో నటించే అవకాశాలు కూడా వచ్చాయి. ఇప్పటికే ఈ అమ్మడు వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ నటి గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అనసూయ చేతిలో అరడజనకి పైగా సినిమాలు ఉన్నాయి.
ఎప్పుడూ సోషల్ మీడియాలో తన అందాలతో రచ్చ చేసే అనసూయ ఇటీవల ఒక్ నోట్ రాసి పోస్టు చేసింది. ఆ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ పోస్ట్ ద్వార తను జబర్దస్త్ నుండి వెళ్ళిపోతున్నట్టు అనసూయ క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే జబర్దస్త్ నుండీ జడ్జ్ లు, ఫేమస్ కమెడియన్లు వెళ్ళిపోయారు. ఇక ఇప్పుడు అనసూయ కూడా ఈ షో నుండి వెళ్ళిపోతే జబర్దస్త్ పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. ఇదిలా ఉండగా అనసూయ జబర్దస్త్ నుండి వెళ్ళిపోతుందని వార్తలు వినిపించడంతో ఆమె స్థానంలో జబర్దస్త్ కి వచ్చే మరో యాంకర్ గురించి చర్చ మొదలయింది.
ఈ క్రమంలో అనసూయ స్థానంలో జబర్దస్త్ కి కొత్త యాంకర్ గా ప్రముఖ యాంకర్ మంజూష రాంపల్లిని తీసుకువస్తున్నట్టు సమాచారం. ఎన్నో ఏళ్లుగా యాంకర్ గా మంచి అనుభవమున్న మంజూష ఈ మధ్యకాలంలో గ్లామర్ తో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా మంజుషకి మంచి ఫాలోయింగ్ ఉంది. అందువల్ల జబర్దస్త్ లో అనసూయ స్థానంలో మంజూష కి స్థానం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…