ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంత అవసరమో అందరికీ తెలిసిన విషయమే. ఆకుకూరలు మన ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు మనం కొత్తిమీర గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కొత్తిమిర అన్ని వంటకాలలో ఉపయోగిస్తారు. కొత్తిమీర వాసన అద్భుతంగా ఉండటమే కాకుండా కొత్తిమీర వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
కానీ కొంతమంది కొత్తిమీర ఆకులను మాత్రమే వాడుకొని కాడలు పనికి రావని వాటిని పడేస్తుంటారు. అందులో ఎన్నో పోషక విలువలు దాగి ఉంటాయి. వాటివల్ల మన ఆరోగ్యానికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కొత్తిమీరలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కొత్తిమీరలో పోషకాలు, ఔషధ విలువలు అనేకం. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కొత్తిమీర మన శరీరంలో రక్తంలోని షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది. ప్రతిరోజు ఉదయమే కొద్దిగా పచ్చి కొత్తిమీరను కడిగి తినటం వల్ల షుగర్ వ్యాధి సమస్య నుండి విముక్తి పొందవచ్చు.
కొత్తిమీరలో యాంటీబ్యాక్టీరియల్ ,యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కొత్తిమీరలో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు, కండరాల నొప్పి నుండి విముక్తి పొందవచ్చు. కొత్తిమీర వల్ల కంటి చూపు సమస్యలు కూడా దూరమవుతాయి.
కొత్తిమీరలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయి. మెటబాలిజం పెరుగుతుంది. మలబద్దకం, కడుపు ఉబ్బరం తగ్గుతాయి. ఆకలి నియంత్రణలో ఉంటుంది.
కొత్తిమీర ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా చాలా తోడ్పడుతుంది. కొత్తిమీరలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మొటిమల సమస్య కూడా తగ్గిస్తుంది.కనుక కొత్తిమీర కాడలలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కనుక వీటిని పడేస్తే మీరు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోతారు.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…