అతడు చేసింది 29 సినిమాలే. అయినా కన్నడ ప్రేక్షక ఆధరణ సంపాదించాడు. అప్పుగా విశేష అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అతడే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్. అతడి వయస్సు 46 ఏళ్లే అయినప్పటికీ ప్రతీ ఒక్కరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. యాక్టర్, ప్లే బ్యాక్ సింగర్, టెలివిజన్ ప్రెజంటర్, ప్రొడ్యూసర్‌గా సినిమా ఫీల్డ్‌లో తన మార్క్ చూపించారు.
ఇవన్నీ సినీ పరిశ్రమ వైపు తనకు ఉన్న ట్యాలెంట్ తో దూసుకుపోయారు. మరోవైపు అతడి సేవా కార్యక్రమాలు కూడా ఎక్కువగానే చేశారు. దాదాపు 45 ఉచిత పాఠశాలలు, వృద్ధాశ్రమాలు, గోశాలలు, అనాథాశ్రమాలు ఎన్నో కట్టించాడు.
అందుకే కంఠీరవకు జనం పోటెత్తారు. ప్రేక్షకులు, అభిమానుల గుండెల్లో సముచిత స్థానం సంపాదించుకున్న అప్పు ఆఖరి చూపు కోసం ఆరాటపడ్డారు. పునీత్ లేరనే విషయాన్ని అతడి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతీ రోజు పునీత్ సమాధి వద్దకు వేల మంది వచ్చి వెళ్తున్నారు.
దాంతో కంఠీరవ స్టేడియం ముందు పోలీసులకు 24 గంటలు కాపలా కాయడమే సరిపోతుంది. వచ్చే అభిమానులను అదుపు చేయలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు.
ఇదిలా ఉండగా.. అతడి సమాధి వద్దకు గంగ, గురు ప్రసాద్ అనే ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకోవటానికి బళ్లారి నుంచి కంఠీరవ స్టూడియోలోని పునీత్ సమాధి వద్దకు వెళ్లారు. వీళ్లు రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. వీరిద్దరికీ పునీత్ అంటే ఎంతో ఇష్టం. దీంతో ఆ ఇద్దరు తమ అభిమాన హీరో సమాధి ముందు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మొదట నిరాకరించిన పోలీసులు.. వాళ్ల తల్లిదండ్రుల సమ్మతంతో అక్కడే పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన తర్వాత పునీత్ తో ఆశీర్వాదం తీసుకోవాలని అనుకున్న మాకు.. ఇలా సమాధి వద్ద పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…