విక్కీ కౌశల్.. బాలీవుడ్ లో గత కొన్ని సంవత్సరాల నుండి విలక్షణమైన పాత్రలతో తనదైన నటనా శైలిలో బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. 2019లో ‘యూరీ.. ది సర్జికల్ స్ట్రైక్’ చిత్రంతో నటుడిగా తన సత్తా ఏంటో చూపించిన విక్కీ ఈ చిత్రంతో డైరెక్ట్ గా జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. టాలీవుడ్ మల్లీశ్వరి గా తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకున్న కత్రినాకైఫ్ కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే.. యంగ్ హీరో విక్కీ కౌశల్, కత్రినాకైఫ్ ల మధ్య ఏదో డేటింగ్ వ్యవహారం నడుస్తుందనే రూమర్స్ సోషల్ మీడియాలో చాలా రోజులుగా హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. అంతే కాకుండా వీళ్ళిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే గాసిప్స్ వెలుగులోకి వచ్చాయి.
ఈ నేపథ్యంలో లేటెస్టుగా ఈ రూమర్స్ ను విక్కీ తోసిపుచ్చారు. తాను ఇప్పటికీ ఒంటరినేనని క్లారిటీ ఇచ్చాడు. కానీ వీక్కీ చెప్పినదానికి.. కత్రినాకైఫ్ విషయంలో జరుగుతున్న దానికి సంబంధం లేదన్నట్టుగా విక్కీ, కత్రినాతో సహ జీవనం చేస్తున్నాడని బాలీవుడ్ కోడై కూస్తోంది. అది అక్షరాలా నిజమేనని నిదర్శంగా అప్పుడప్పుడు వీళ్ళిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ ప్రేమ వ్యవహారాన్ని ఎంత రహస్యంగా దాచాలనుకున్నా ఏదో రకంగా మీడియా ఓ కంట కనిపెడుతూనే వుంటుంది.
తాజాగా ఆదివారం అర్ధరాత్రి తలకు క్యాప్, ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజు ధరించిన విక్కీ.. ఎవరూ చూడకూడదనే హడావిడిలో కారు దిగి కత్రినా కైఫ్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో విక్కీ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ముంబైలో జరిగిన ఈ సంఘటన మీడియా కంట పడటంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…