Categories: FeaturedMovie News

సుశాంత్ లా నేను కుడా ఉరి వేసుకుంటానెమోనని భయంతో.. – సూరజ్ పంచోలి..

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్, దిశా సలియాన్ ఇద్దరూ బలవాన్మరణం పొందిన సంగతి తెలిసిందే. అయితే వీళ్ళిద్దరి మరణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో సుశాంత్ కేసు సి.బీ.ఐ అధికారుల చేతుల్లోకి వెళ్ళింది. దాంతో ఈ కేసు దర్యాప్తు స్పీడ్ అందుకుంది.

ఈ క్రమంలో మరో బాలీవుడ్ హీరో సూరజ్ పంచోలి ఊహించని విధంగా తెర పైకి రావడంతో బాలీవుడ్ మీడియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బాలీవుడ్ అందాల తార జియా ఖాన్ మరణం వెనుక సూరజ్ పంచోలి హస్తం ఉన్నట్లుగా, సల్మాన్ ఖాన్ అండ దండలతోనే సూరజ్ బయటపడ్డారనే ఆరోపణలు మరోసారి సుశాంత్ సంఘటన తర్వాత సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. జియా ఖాన్ మరణ సంఘటనపై నటుడు సూరజ్‌ పంచోలి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికి ఈ కేసు విచారణ కొనసాగుతుంది. తాజాగా సూరజ్ కారణంగా దిశ గర్భవతి అయిందని, ఆ సంగతి సుశాంత్ కు తెలిసిందని, అందుకనే దిశాను, సుశాంత్ ను ఇద్దరినీ ప్లాన్ ప్రకారం సూరజ్యే హత్య చేయించి వీళ్ళిద్దరూ మానశిక సమస్యలతో బలవాన్మరణం పొందినట్టుగా చిత్రీకరించి ఉండొచ్చని.. గతంలో హీరోయిన్ జియా ఖాన్ ని కూడా సూరజ్ ప్లాన్ ప్రకారమే చేసి హత్య చేసారని.. అలాగే సుశాంత్‌ మాజీ మేనేజర్‌ దిశా సలియన్‌ ఆత్మహత్యకు, సూరజ్‌ పంచోలికి సంబంధం ఉందంటూ ఈ సందర్భంగా కొన్ని రూమర్స్ వెలుగులోకి వచ్చాయి.

ఇదిలావుండగా ఈ రూమర్స్ కు స్పందించిన సూరజ్‌ పంచోలి.. తానసలు దిశా సలియన్‌ అనే అమ్మాయిని ఇంత వరకు కలవలేదని, అనవసరంగా తనను దిశ కేసులోకి లాగుతున్నారని, ఇవన్ని తప్పుడు వార్తలని, ఇప్పటికే తనపై ఓ పోలీసు ఓ కేసు నడుస్తుందని, జియా ఖాన్‌ కేసు ప్రారంభం అయ్యి ఇప్పటికే 8 సంవత్సరాలు పూర్తైనా.. నేటికీ ఆ కేసు విషయంలో తీర్పు ఇంకా రాలేదని, జియా తల్లి రబియా ఖాన్‌ వలనే తీర్పు రావడం ఆలస్యమౌతుందని, తనపై ఇలాంటి భయంకరమైన రూమర్స్ ఎన్ని వచ్చినప్పటికి తాను కాన్ఫిడెన్స్ గా వుండేందుకు ప్రయత్నిస్తున్నానని, ఈ విషయాల గురించి తన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనని, ఈమధ్య సుశాంత్‌ మరణ సంఘటన గురించి తెలిసుకున్న తన తల్లి తాను కూడా సుశాంత్ లాగే ఎక్కడైతే ఉరి వేసుకుంటానెమోనని ఎంతో భయపడిందని, ఇప్పటికే తన ఫ్యామిలీ మెంబర్స్ అంతా తన విషయంలో ఎంతో మానశిక ఒత్తిడికి గురవుతున్నారని.. వాళ్ళను మరింత ఇబ్బంది పెట్టడం తనకిష్టం లేదన్నారు పంచోలి. ఇంకా తను మాట్లాడుతూ.. ఇలాంటి పనికిమాలిన రూమర్స్ తనపై రావడం వలన బాలీవుడ్ లో అతి కొద్ది మంది మాత్రమే తనతో పని చేస్తున్నారని, ఇలాంటి పనికిమాలిన రూమర్స్ వలన తన జీవితం మరింత నాశనమౌతుందని ఆవేదన వ్యక్తం చేశారు పంచోలి.

ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఈమధ్యనే ఓ మీడియా ఛానెల్ సూరజ్ కి దిశాకు సంబంధాలు ఉన్నాయంటూ ఆమెతో సూరజ్ కలిసి దిగిన ఫోటోలను ప్రసారం చేసింది. మీడియా ఛానల్ లో ప్రసారమైన ఆ ఫోటోలని జతచేస్తూ ”కంప్లీట్ బుల్ షిట్. ఇలాంటి మీడియాను మీరు నమ్ముతున్నారా? ఆ ఫొటోలో ఉన్న అమ్మాయి దిశా సలియాన్ కాదు. ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ అనుశ్రీ గౌరీ. 2016లో ఆమెతో కలిసి దిగిన ఫోటో. ఆమె ప్రస్తుతం ఇండియాలో కూడా లేదు. దయచేసి ఇలాంటి తప్పుడు రూమర్స్ ను క్రియేట్ చేసి బాలీవుడ్ ప్రేక్షకుల బ్రెయిన్ వాష్ చేయకండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago