బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్, దిశా సలియాన్ ఇద్దరూ బలవాన్మరణం పొందిన సంగతి తెలిసిందే. అయితే వీళ్ళిద్దరి మరణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో సుశాంత్ కేసు సి.బీ.ఐ అధికారుల చేతుల్లోకి వెళ్ళింది. దాంతో ఈ కేసు దర్యాప్తు స్పీడ్ అందుకుంది.

ఈ క్రమంలో మరో బాలీవుడ్ హీరో సూరజ్ పంచోలి ఊహించని విధంగా తెర పైకి రావడంతో బాలీవుడ్ మీడియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బాలీవుడ్ అందాల తార జియా ఖాన్ మరణం వెనుక సూరజ్ పంచోలి హస్తం ఉన్నట్లుగా, సల్మాన్ ఖాన్ అండ దండలతోనే సూరజ్ బయటపడ్డారనే ఆరోపణలు మరోసారి సుశాంత్ సంఘటన తర్వాత సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. జియా ఖాన్ మరణ సంఘటనపై నటుడు సూరజ్ పంచోలి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికి ఈ కేసు విచారణ కొనసాగుతుంది. తాజాగా సూరజ్ కారణంగా దిశ గర్భవతి అయిందని, ఆ సంగతి సుశాంత్ కు తెలిసిందని, అందుకనే దిశాను, సుశాంత్ ను ఇద్దరినీ ప్లాన్ ప్రకారం సూరజ్యే హత్య చేయించి వీళ్ళిద్దరూ మానశిక సమస్యలతో బలవాన్మరణం పొందినట్టుగా చిత్రీకరించి ఉండొచ్చని.. గతంలో హీరోయిన్ జియా ఖాన్ ని కూడా సూరజ్ ప్లాన్ ప్రకారమే చేసి హత్య చేసారని.. అలాగే సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలియన్ ఆత్మహత్యకు, సూరజ్ పంచోలికి సంబంధం ఉందంటూ ఈ సందర్భంగా కొన్ని రూమర్స్ వెలుగులోకి వచ్చాయి.

ఇదిలావుండగా ఈ రూమర్స్ కు స్పందించిన సూరజ్ పంచోలి.. తానసలు దిశా సలియన్ అనే అమ్మాయిని ఇంత వరకు కలవలేదని, అనవసరంగా తనను దిశ కేసులోకి లాగుతున్నారని, ఇవన్ని తప్పుడు వార్తలని, ఇప్పటికే తనపై ఓ పోలీసు ఓ కేసు నడుస్తుందని, జియా ఖాన్ కేసు ప్రారంభం అయ్యి ఇప్పటికే 8 సంవత్సరాలు పూర్తైనా.. నేటికీ ఆ కేసు విషయంలో తీర్పు ఇంకా రాలేదని, జియా తల్లి రబియా ఖాన్ వలనే తీర్పు రావడం ఆలస్యమౌతుందని, తనపై ఇలాంటి భయంకరమైన రూమర్స్ ఎన్ని వచ్చినప్పటికి తాను కాన్ఫిడెన్స్ గా వుండేందుకు ప్రయత్నిస్తున్నానని, ఈ విషయాల గురించి తన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనని, ఈమధ్య సుశాంత్ మరణ సంఘటన గురించి తెలిసుకున్న తన తల్లి తాను కూడా సుశాంత్ లాగే ఎక్కడైతే ఉరి వేసుకుంటానెమోనని ఎంతో భయపడిందని, ఇప్పటికే తన ఫ్యామిలీ మెంబర్స్ అంతా తన విషయంలో ఎంతో మానశిక ఒత్తిడికి గురవుతున్నారని.. వాళ్ళను మరింత ఇబ్బంది పెట్టడం తనకిష్టం లేదన్నారు పంచోలి. ఇంకా తను మాట్లాడుతూ.. ఇలాంటి పనికిమాలిన రూమర్స్ తనపై రావడం వలన బాలీవుడ్ లో అతి కొద్ది మంది మాత్రమే తనతో పని చేస్తున్నారని, ఇలాంటి పనికిమాలిన రూమర్స్ వలన తన జీవితం మరింత నాశనమౌతుందని ఆవేదన వ్యక్తం చేశారు పంచోలి.
ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఈమధ్యనే ఓ మీడియా ఛానెల్ సూరజ్ కి దిశాకు సంబంధాలు ఉన్నాయంటూ ఆమెతో సూరజ్ కలిసి దిగిన ఫోటోలను ప్రసారం చేసింది. మీడియా ఛానల్ లో ప్రసారమైన ఆ ఫోటోలని జతచేస్తూ ”కంప్లీట్ బుల్ షిట్. ఇలాంటి మీడియాను మీరు నమ్ముతున్నారా? ఆ ఫొటోలో ఉన్న అమ్మాయి దిశా సలియాన్ కాదు. ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ అనుశ్రీ గౌరీ. 2016లో ఆమెతో కలిసి దిగిన ఫోటో. ఆమె ప్రస్తుతం ఇండియాలో కూడా లేదు. దయచేసి ఇలాంటి తప్పుడు రూమర్స్ ను క్రియేట్ చేసి బాలీవుడ్ ప్రేక్షకుల బ్రెయిన్ వాష్ చేయకండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.



























