Featured

Youtuber Srikanth Reddy : ఆర్జీవి నా ముందు బచ్చాగాడు.. నాది హాలీవుడ్ రేంజ్..! యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Youtuber Srikanth Reddy : కరాటే కళ్యాణి – శ్రీకాంత్ రెడ్డి వివాదంతో అంతకుముందు ఎవరికీ అంతగా తెలియని యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాలలో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. కరాటే కళ్యాణి తో దెబ్బలు తింటే తిన్నాడు కానీ శ్రీకాంత్ రెడ్డి కి ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది. అంతే కాకుండా ఈ వివాదంలో కొంతమంది శ్రీకాంత్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు. సోషల్ మీడియా అటు డిజిటల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈ వివాదమే కనిపిస్తుంది. దీంతో శ్రీకాంత్ రెడ్డి పేరు అన్నిచోట్ల వినిపిస్తోంది. దీంతో శ్రీకాంత్ రెడ్డి, టాలీవుడ్ లో వివాదాలు అంటేనే గుర్తుకు వచ్చే ఆర్జీవి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆర్జీవి నాకు ఇన్స్పిరేషన్ ఏంటి తొక్క… వాడు నా ముందు బచ్చా….

ఇండస్ట్రీలోకి రావడానికి ఆర్జీవి నాకు స్ఫూర్తి అని గతంలో చెప్పిన శ్రీకాంత్ రెడ్డి, ఇప్పుడు మాట మార్చేస్తున్నాడు. ఒక రోజు వర్మని కలవడానికి ఆఫీస్‌కి వెళ్తే.. అక్కడ ఉన్న వర్మ అసిస్టెంట్‌లు నన్ను మందు బాటిల్స్ తీసుకురమ్మన్నారు. తీరా తెచ్చి ఇచ్చిన తరువాత వర్మని కలవడానికి వీళ్లేదని వెనక్కి పంపేశారు. ఇక అప్పటి నుండి ఈ యవ్వారాలు మనకు కరెక్ట్ కాదని.. నా పని నేను చేసుకుందామని అమీర్ పేటలో బజ్జీలు బండి మొదలు, తరువాత ఇంటికి వెళ్లి మెడికల్ షాప్, అక్కడ ఇబ్బందులు, ఇలా చాలా చేసాను. చివరికి హైదరాబాద్ వచ్చి యూట్యూబ్ లో వీడియోలు తీయడం ప్రారంభించాను అని చెప్పాడు.

ఇక వర్మ గురించి చెబుతూ… జనరేషన్ మారే కొద్ది ఇండస్ట్రీలో కి కొత్త వాళ్లు వస్తూనే వుంటారు. వాళ్ళ ముందు యువతే గొప్ప. పెద్దవాళ్ల పంచాయితీ ఎపుడో అయిపోయింది. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా యవకులది. వర్మకు వయసు ఐపోయింది. వర్మ నాకు ఇన్స్పిరేషన్ ఏంటి తొక్క, అతను నా ముందు బచ్చాగాడు. నాకంటే గొప్పవాడు ఏం కాదు. అంత దమ్ముంటే నాతో డిబేట్‌లో పాల్గొని, నాతో మాట్లాడితే తెలుస్తుంది, అని ఆర్జీవి మీద సంచలన వ్యఖ్యలు చేశారు.

అంతేకాకుండా కరాటే కళ్యాణి తో వివాదం తర్వాత నా దమ్ము ఎంతో నాకు తెలిసింది అని, నా వీడియోలు ఆపాలని చూస్తే మాత్రం పోరాటం చేస్తాను, నా వీడియోలు ఆపాలంటే ముందు సినిమాలో ఐటెం సాంగ్స్ ఆపేయాలి. కొంతమంది సినిమాలో ఎలాంటి సీన్లు పెడుతున్నారు వాటికంటే నా వీడియోలు పర్వాలేదు, వీటివల్ల యువత చెడిపోతుంది అనడం కరెక్ట్ కాదు. నేను చేసే పని తప్పు అయితే నేను చేసే ప్రాంక్ వీడియో లోని అమ్మాయిలే నన్ను సమర్థించరు కదా అని తనని తాను సమర్థించుకున్నాడు.

సన్నీ లియోన్ తో సినిమా…..

Sunny Leone: సన్నీలియోన్ పాటను నిషేధించాలి.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..!

అంతే కాకుండా కొత్తపేట గ్రామం అనే సినిమా తీస్తున్నాను అని, ఆ సినిమా లో సన్నీలియోన్ తో ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాం అని తన ఫ్రెండ్ అయిన మహీంద్ర దర్శకత్వం వహిస్థాడని చెప్పారు. దీనికోసం 2కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టె నిర్మాత వస్తే పెట్టిన దానికి డబల్ వచ్చేలా సినిమా చేస్తామని చెప్పారు. ఇది సక్సెస్ అయితే తాను టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఇలా ఎక్కడికో వెళ్తానని చెప్తున్నాడు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago