Shivani Rajashekhar : అద్భుతం సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైనా శివాని రాజశేఖర్ ప్రస్తుతం తన తండ్రి రాజశేఖర్ తో కలిసి శేఖర్ సినిమాలో నటించింది. మే 20వ తేదీ విడుదల చేయాలనుకుంటున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక మే 17న గ్రాండ్ గా నిర్వహించారు. మలయాళం సినిమా జోసెఫ్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో శివాని రాజశేఖర్ ముఖ్య పాత్రలో, తన తండ్రితో కలిసి నటించనుంది. ఇక ఈ సినిమాకు జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు.
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ శివాని బాగా ఎమోషనల్ అయింది. వేడుకలో ఉన్న అందరిని ఎమోషనల్ చేసేసింది. సినిమా షూటింగ్ మొదలవడానికి ఇంకో 10 రోజులు ఉండగా నాకు నాన్నకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కోవిడ్ నుండి నేను కోలుకున్నాను కానీ నాన్న నెలన్నర వరకు ఆసుపత్రిలో బాధపడ్డారు. బాత్రూంకి వెళ్లే సమయంలో సాచురేషన్ పడిపోయేది. ఇంటి పెద్ద నాన్నే ఆయన డాక్టర్ కూడా అలాంటి ఆయనే అలా హాస్పిటల్ లో ఉండే సరికి ఏమి చేయాలో దిక్కుతోచలేదు.
నేను దురదృష్టవంతురాలిని…..
ఆరేళ్లు నా సినిమా విడుదల అవ్వకుండా ఆగిపోవడంతో అందరు నన్ను దురదృష్టవంతురాలిని అని అనేవారు. ఇక పూజలు లాంటివి చేయమని చెప్పేవారు. నేను వాటిని నమ్మే దానినికాదు. కానీ నావల్లే మా నాన్నకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని అన్నపుడు చాలా బాధపడ్డాను. అపుడు మాత్రం నేను దురదృష్టవంతురాలిని అని బాధపడ్డాను. ఇక ఓ రోజు డాక్టర్ నాన్న బ్రతికే ఛాన్స్ 50-50 అని చెప్పినపుడు డాడీ నువ్ ఇలా చేయొద్దు, బయటకు రా, పోరాడు. నా వల్లే నీకు ఇలా అయ్యింది, నేను తట్టుకోలేను అని ఆసుపత్రిలోనే ఏడ్చేశాను. అప్పుడు డాడీ మాస్క్ తీసేసి, నీ వల్ల రావడం ఏంట్రా.. నీ వల్ల కాకపోతే ఇంకెవరి వల్లనో వచ్చుండేది .. నాకేం కాదు. అని అన్నారు అని చెప్తూ శివాని తీవ్ర భావోద్వేగానికి గురయ్యింది. ఇక ఈ విషయం చెప్పి శివాని అందరిని భావొద్వేగానికి గురి చేసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…