Ali : స్టార్ కమెడియన్ గా తెలుగు తెరపై నవ్వులు పూయిస్తున్న అలీ ప్రస్తుతం స్పీడ్ తగ్గించారు. సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నారు. ఈటీవీ లో ప్రసారమయ్యే అలీతో సరదాగా షో లో యాంకర్ గా ఉంటూ అపుడపుడు సినిమాల్లో కనిపిస్తున్న అలీ f3 సినిమాతో త్వరలో మన ముందుకు రాబోతున్నారు. ఇక f3 సినిమా ప్రచారాల్లో భాగంగా సినిమాలో తన పాత్ర గురించి, సినీ కెరీర్, తన రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడారు.
F3 లో పాత్ర అందరిని ఆకట్టుకుంటుంది…..
ఇక f3 సినిమాలో నటించిన ఆలీ సినిమా గురించి చెబుతూ సినిమా ఆసాంతం నవ్విస్తుందని ఇందులో తన పాత్ర పేరు పాల బేబీ అనే ఒక వడ్డీ వ్యాపారి అని ఆడవాళ్లంటే విపరీతమైన గౌరవం ఉంటుందని సినిమా చివర్లో అసలు విషయం తెలుస్తుందని వివరించారు. ఇక సినిమాలో 45 నిమిషాల పాటు తన పాత్ర ఉంటుందని చెప్పారు. F3 సినిమా పైసా వసూలు అని వంద రూపాయల టికెట్ కొంటే మూడోందల రూపాయల ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అని చెప్పారు.
జగన్ నన్ను రాజకీయంగా నిలబెడతానని మాటిచ్చారు….
ఇక కామెడీ టైమింగ్ లో చిరంజీవి,వెంకటేష్, మోహన్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబులు ఎక్స్‌పర్ట్స్ అంటూ చెప్పారు. ఇక రాజకీయాల గురించి ప్రస్తావించగా సినిమాల్లో నన్ను నిలబెట్టింది కృష్ణ రెడ్డి గారూ ఇక అలాగే నన్ను రాజకీయాల్లో నిలబెట్టింది జగన్ మోహన్ రెడ్డి గారు. ఆయన నాకు ఏ హామీ ఇవ్వలేదు. ఏదో ఒక రోజు కాల్ వస్తే మీ సమక్షంలోనే ఆ విషయాన్నీ పంచుకుంటా అంటూ మీడియాతో ముచ్చటించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…