YS Jagan : యే హరి రామ కృష్ణ జగన్.. మీకు ఏమైంది. ఇప్పటికైనా కళ్లు తెరవకుంటే ఎలా? ఎక్కడి వారినో తీసుకొచ్చి మరో ప్లేస్‌లో పడేస్తే ఎలా? ఇప్పటికి దెబ్బతిన్నది చాలదా? ఇంకా ఇంకానా.. ఇప్పటికైనా జరిగే ఎన్నికల్లో విజయం సాధిస్తుంటే కదా.. జనం వైసీపీ వైపు చూసేది? లేకుంటే చూసే దిక్కూ దివాణం ఉండదు. అసలేం జరిగింది అంటారా? ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఇక్కడి నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు. దీనిపై వైసీపీ నేతలు, కార్యకర్తల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీని వీడటంతో ఆయనపై అనర్హత వేటు వేసింది. దీంతో అక్కడ ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎమ్మెల్సీ టికెట్‌ను చాలా మంది వైసీపీ నేతలు ఆశించారు. అందరినీ కాదని.. ఆ టికెట్‌ను బొత్సకు అధిష్టానం కేటాయించింది. దీంతో స్థానిక నేతలకు ఇది మింగుడు పడటం లేదు. పార్టీలో ఒకరకంగా చీలికలు ప్రారంరభమయ్యాయి. పార్టీ అభ్యర్థులంతా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో అందరి కళ్లూ శాసనమండలిపైనే పడ్డాయి.
ఎక్కడి వ్యక్తినో తీసుకొచ్చి..
వాస్తవానికి టీడీపీ కూటమికి గెలిచే అవకాశం లేదు. కానీ ఆ కూటమి తెగ ట్రై చేస్తోంది. అలాంటప్పుడు వైసీపీ ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి? కానీ వైసీపీ అధినేత జగన్ ఇప్పటికీ చేసిన తప్పులనే చేస్తూ పోతున్నారు. స్థానిక నాయకులు లేనట్టు బొత్సను తీసుకొచ్చి విశాఖలో కూర్చోబెట్టడమేంటి? అసలు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను పోటీకి దింపుతున్నట్టు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీంతో పార్టీ నేతలంతా పైకి బాగానే కనిపించినా లోలోపల మాత్రం రగిలిపోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పోటీ చేసిన అభ్యర్థులతో అమరావతిలో సమావేశం నిర్వహించి మరీ ఈ విషయాన్ని ప్రకటించారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో ఓట్లు వేసేది ఉమ్మడి విశాఖ జిల్లాలోని స్థానిక సంస్థల ప్రతినిధులు మాత్రమే. మరి అలాంటప్పుడు ఎక్కడి వ్యక్తినో తీసుకొచ్చి.. స్థానికంగా ఎవరూ లేనట్టు అభ్యర్థిగా ప్రకటిస్తే ఎలా? గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు వరుదు కల్యాణిని ప్రకటిస్తే వైసీపీ నేతలు నానా రచ్చ చేశారు. ఆమె శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తని ఆమెను ఎలా విశాఖ నుంచి బరిలోకి దింపుతారంటూ ఫైర్ అయ్యారు. కనీసం ఆ విషయాన్ని కూడా జగన్ దృష్టిలో పెట్టుకోలేదు.
జెండాలను మోస్తూ కూర్చోవాలా?
విజయనగరం జిల్లాకు చెందిన బొత్సను ఎంపిక చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు విశాఖలో ఎవరూ లేనట్టు జగన్ పదే పదే ఇలాగే చేస్తున్నారని స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బొత్స ఝాన్సీని పోటీకి దింపారు. ఇప్పుడేమో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సను తీసుకొచ్చి నిలబెట్టారు. ఇక మేమొప్పుడూ పార్టీ జెండాలను మోస్తూ కూర్చోవాలా? మాకు పదవులు అక్కర్లేదా? అని మండి పడుతున్నారు. బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్‌నాథ్ వంటి వారు ఉండగా కూడా వారిని వదిలేసి ఇదేంటని ప్రశ్నిస్తున్నారు. స్థానిక నాయకులు సైతం ఎన్నో ఆవలు పెట్టుకున్నారు. తమకు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ ఎఫెక్ట్ అంతా కూడా పార్టీపైనే కదా చూపిస్తుంది. తమను అవమానించినట్టుగా వైసీపీ నేతలు ఫీలవుతున్నారు. మొత్తానికి జగన్ లేని పోని తలనొప్పులు తెచ్చిపెట్టుకుంటున్నారు. గెలిచే అవకాశాన్ని తానే చేజేతులా నాశనం చేసుకుంటున్నారనిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…