Connect with us

Featured

YS JAGAN : ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స.. హరి రామ కృష్ణ జగన్.. ఆప్కో క్యా హువా..!

Published

on

YS Jagan : యే హరి రామ కృష్ణ జగన్.. మీకు ఏమైంది. ఇప్పటికైనా కళ్లు తెరవకుంటే ఎలా? ఎక్కడి వారినో తీసుకొచ్చి మరో ప్లేస్‌లో పడేస్తే ఎలా? ఇప్పటికి దెబ్బతిన్నది చాలదా? ఇంకా ఇంకానా.. ఇప్పటికైనా జరిగే ఎన్నికల్లో విజయం సాధిస్తుంటే కదా.. జనం వైసీపీ వైపు చూసేది? లేకుంటే చూసే దిక్కూ దివాణం ఉండదు. అసలేం జరిగింది అంటారా? ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఇక్కడి నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు. దీనిపై వైసీపీ నేతలు, కార్యకర్తల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీని వీడటంతో ఆయనపై అనర్హత వేటు వేసింది. దీంతో అక్కడ ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎమ్మెల్సీ టికెట్‌ను చాలా మంది వైసీపీ నేతలు ఆశించారు. అందరినీ కాదని.. ఆ టికెట్‌ను బొత్సకు అధిష్టానం కేటాయించింది. దీంతో స్థానిక నేతలకు ఇది మింగుడు పడటం లేదు. పార్టీలో ఒకరకంగా చీలికలు ప్రారంరభమయ్యాయి. పార్టీ అభ్యర్థులంతా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో అందరి కళ్లూ శాసనమండలిపైనే పడ్డాయి.

Advertisement

ఎక్కడి వ్యక్తినో తీసుకొచ్చి..

వాస్తవానికి టీడీపీ కూటమికి గెలిచే అవకాశం లేదు. కానీ ఆ కూటమి తెగ ట్రై చేస్తోంది. అలాంటప్పుడు వైసీపీ ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి? కానీ వైసీపీ అధినేత జగన్ ఇప్పటికీ చేసిన తప్పులనే చేస్తూ పోతున్నారు. స్థానిక నాయకులు లేనట్టు బొత్సను తీసుకొచ్చి విశాఖలో కూర్చోబెట్టడమేంటి? అసలు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను పోటీకి దింపుతున్నట్టు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. దీంతో పార్టీ నేతలంతా పైకి బాగానే కనిపించినా లోలోపల మాత్రం రగిలిపోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పోటీ చేసిన అభ్యర్థులతో అమరావతిలో సమావేశం నిర్వహించి మరీ ఈ విషయాన్ని ప్రకటించారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో ఓట్లు వేసేది ఉమ్మడి విశాఖ జిల్లాలోని స్థానిక సంస్థల ప్రతినిధులు మాత్రమే. మరి అలాంటప్పుడు ఎక్కడి వ్యక్తినో తీసుకొచ్చి.. స్థానికంగా ఎవరూ లేనట్టు అభ్యర్థిగా ప్రకటిస్తే ఎలా? గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు వరుదు కల్యాణిని ప్రకటిస్తే వైసీపీ నేతలు నానా రచ్చ చేశారు. ఆమె శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తని ఆమెను ఎలా విశాఖ నుంచి బరిలోకి దింపుతారంటూ ఫైర్ అయ్యారు. కనీసం ఆ విషయాన్ని కూడా జగన్ దృష్టిలో పెట్టుకోలేదు.

జెండాలను మోస్తూ కూర్చోవాలా?

విజయనగరం జిల్లాకు చెందిన బొత్సను ఎంపిక చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు విశాఖలో ఎవరూ లేనట్టు జగన్ పదే పదే ఇలాగే చేస్తున్నారని స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బొత్స ఝాన్సీని పోటీకి దింపారు. ఇప్పుడేమో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సను తీసుకొచ్చి నిలబెట్టారు. ఇక మేమొప్పుడూ పార్టీ జెండాలను మోస్తూ కూర్చోవాలా? మాకు పదవులు అక్కర్లేదా? అని మండి పడుతున్నారు. బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్‌నాథ్‌ వంటి వారు ఉండగా కూడా వారిని వదిలేసి ఇదేంటని ప్రశ్నిస్తున్నారు. స్థానిక నాయకులు సైతం ఎన్నో ఆవలు పెట్టుకున్నారు. తమకు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ ఎఫెక్ట్ అంతా కూడా పార్టీపైనే కదా చూపిస్తుంది. తమను అవమానించినట్టుగా వైసీపీ నేతలు ఫీలవుతున్నారు. మొత్తానికి జగన్ లేని పోని తలనొప్పులు తెచ్చిపెట్టుకుంటున్నారు. గెలిచే అవకాశాన్ని తానే చేజేతులా నాశనం చేసుకుంటున్నారనిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

Advertisement

Featured

Murali Sharma: నటుడు మురళీ శర్మ భార్య ఎవరో తెలుసా… ఆమె ఇండస్ట్రీలో క్రేజీ విలనా?

Published

on

Murali Sharma: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ నటుడుగా ఎంతో మంచి గుర్తుంటే సంపాదించుకున్న వారిలో మురళి శర్మ ఒకరు. ఈయన సినిమాలో ఒక పాత్రకు కమిట్ అయ్యారంటే ఆరు నూరైనా సరే ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తూ ఉంటారు. ఇక ఎక్కువగా తండ్రి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంటారు.

Advertisement

ఇలా ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన మురళి శర్మ భార్యకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారిన ఈయన భార్య కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ విలన్ అనే విషయం చాలామందికి తెలియదు. మరి మురళి శర్మ భార్య ఎవరు ఏంటి ఆమె ఏ సినిమాలలో నటించారు అనే విషయానికి వస్తే…

మురళీ శర్మ భార్య పేరు అశ్వినీ కల్‌శేఖర్. ‘బ్రదినాథ్’ సినిమాలో విలన్ సర్కార్ భార్యగా నటించింది ఈవిడే. ఈ సినిమాలో విలన్‌ కంటే ఎక్కువ హైలేట్ అయింది అశ్వినీనే. అంతేకాకుండా నిప్పు సినిమాలో ప్రదీప్ రావత్ భార్యగా లేడీ విలన్‌గా నటించారు. ఇలా పలు తెలుగు సినిమాలలో విలన్ పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

అశ్వినీ కల్‌శేఖర్…
మరోవైపు స్టార్ హీరోలతో వెబ్ సిరీస్‌లు కూడా చేసింది. ఇక మహేష్ బాబు హీరోగా నటించిన అతిథి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. మురళీ శర్మ. ఇక ఈ మొదటి సినిమాకి ఈయన నంది అవార్డు అందుకున్నారు. ఇలా ఈ భార్యాభర్తలిద్దరూ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ నటీనటులు అనే విషయం తెలిసిన అభిమానులు షాక్ అవుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Star Heroin: లిప్ లాక్… రక్తం కారుతున్న హీరోయిన్ ను వదిలిపెట్టని హీరో.. అంతలా రెచ్చిపోయారా?

Published

on

Star Heroin: సాధారణంగా హీరో హీరోయిన్లు ఒకసారి కెమెరా ముందుకు వచ్చారు అంటే వారిని వాళ్ళు మర్చిపోయి వారు నటించే పాత్రలో లీనం అవుతూ నటిస్తూ ఉంటారు. కొన్నిసార్లు డైరెక్టర్లు షాట్ ఓకే చెప్పినా కూడా వాళ్లు మాత్రం అదే పాత్రలోనే ఉండిపోతుంటారు. ఈ క్రమంలోనే ఒక స్టార్ హీరో తన పాత్రలో లీనమౌతూ ఒక హీరోయిన్ కు లిప్ కిస్ పెడుతూ ఉండిపోయారు. పెదవుల నుంచి రక్తం కారుతున్న కూడా ఆయన వదిలిపెట్టలేదు.

Advertisement

మరి ఆ హీరో హీరోయిన్లు ఎవరు ఏంటీ అనే విషయానికి వస్తే… ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని ఓ రేంజ్ లో ఏలిన నటి మాధురి దీక్షిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె గురించి ఈతరం వారికి తెలియదు కానీ ఒకప్పుడు మాత్రం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. ఈమె కనుక సినిమాలో కనిపించింది అంటే సినిమా హిట్ అనే నమ్మకం నిర్మాతలకు ఉండేది.

క్షమాపణలు చెప్పిన హీరో..
ఇలా ఈమె క్రేజ్ చూసిన దర్శక నిర్మాతలు ఈమె కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న బాలీవుడ్ స్టార్ హీరో వినోద్ ఖన్నాతో కలిసి దయావన్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఒక లిప్ కిస్ సన్నివేశం ఉంది అయితే ఈ సీన్ చేసేటప్పుడు డైరెక్టర్ కట్ చెప్పినా కూడా హీరో ఈ సన్ని వేషంలో లీనం అయిపోయి ఆమె పెద్దవి గట్టిగా కొరికారట రక్తం వస్తున్న కూడా వదలలేదని,ఈ దెబ్బతో యూనిట్ అంతా షాక్ అయ్యారు. అంతేకాకుండా అలా వినోద్ ఖన్నా పెదవి కొరికేయడంతో ఏడ్చుకుంటూ సెట్ నుంచి వెళ్లిపోయిందట. అనంతరం డైరెక్టర్ తో పాటు హీరో కూడా ఆమెకు క్షమాపణలు చెప్పారని తెలుస్తుంది.

Advertisement
Continue Reading

Featured

Star Hero: స్కూల్ ఇష్టం లేక ఉల్లిపాయ పెట్టుకున్న హీరో .. కట్ చేస్తే వేలకోట్లకు అధిపతి.. ఎవరంటే?

Published

on

Star Hero: సాధారణంగా చిన్నపిల్లలు స్కూల్ కి వెళ్లాలంటే ఎంతో మారం చేస్తారు. స్కూల్ కి వెళ్లకుండా ఉండడం కోసం ఎన్నో ఎత్తులు వేస్తూ ఉంటారు. అయితే ఒక స్టార్ హీరో కూడా ఇలా స్కూల్ కి వెళ్లకుండా చిన్నప్పుడు ఎన్నో దేశాలు వేసేవారని తెలుస్తోంది. ఇలా స్కూల్ కి వెళ్లకుండా ఉండటం కోసం ఈ స్టార్ హీరో చేసిన పని తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.

Advertisement

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ నటుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు అమితాబ్ బచ్చన్ ఒకరు. ప్రస్తుతం ఈయన ఇతర భాషలలో కూడా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. హీరోగా ఒకానొక సమయంలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అమితాబ్ బచ్చన్ వేల కోట్లలో ఆస్తులను సంపాదించారు.

వేలకోట్లకు అధిపతి..
ప్రస్తుతం కరోడ్‌పతి 16వ సీజన్‌ను హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఒక్కో షోకి ఆయన రూ.5కోట్లు తీసుకుంటున్నాడు. ఈ షోలో భాగంగా ఆయన తన బాల్యం గురించి ఎవరికి తెలియని ఒక సీక్రెట్ బయటపెట్టారు. చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళాలి అనిపించకపోతే ఉల్లిపాయలు తీసుకుని చంకలో పెట్టుకునే వాణ్ణి. ఇలా చేయటం వల్ల ఒళ్ళు మొత్తం వేడి అయ్యేది అప్పుడు ఇంట్లో వాళ్ళు జ్వరం వచ్చింది అని నన్ను స్కూల్ కి పంపించే వాళ్లు కాదు అంటూ ఎవరికి తెలియని ఈ సీక్రెట్ చెప్పడంతో అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!