Political News

YS Jagan: ఈవీఎంలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్.. అనుమానాలంటూ?

YS Jagan: వైకాపా అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.రాజ్యాంగానికి ఆమోదముద్ర పడ్డ సరిగ్గా 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

మన రాజ్యాంగం సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ మరియు సౌభ్రాతృత్వానికి హామీ ఇస్తుంది. అలాంటి ప్రాముఖ్యత కల్గిన రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడమే మూల స్తంభం.

ఈవీఎంల పనితీరు గురించి దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొన్నది. వీటి పనితీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాలలో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరుగుతున్నాయి. అలాంటి సమయంలో మనం కూడా ఎందుకు బ్యాలెట్ వైపు వెళ్లకూడదని మనల్ని మనం ప్రశ్నించుకోవాలని తెలిపారు.

YS Jagan: బ్యాలెట్..

ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాదు.. ఉన్నట్టుగా కూడా కనబడాలి. అందరి ప్రాథమిక హక్కు అయిన వాక్ స్వాతంత్ర్యం కొంతకాలంగా అణచివేయబడుతోంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సహా రాజ్యాంగాన్ని రూపొందించిన మన దార్శనిక నాయకులు సమానత్వం వైపు నడిపించారని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.. ఇలా ఈయన ఈవీఎంల పనితీరు గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ పోస్ట్ సంచలనంగా మారడమే కాకుండా ఈ పోస్టుపై విభిన్న రకాలుగా స్పందిస్తూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

https://x.com/ysjagan/status/1861250399442800991?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1861250399442800991%7Ctwgr%5Eb704d8992a5cf12d304315f4bcaff509b70ba0ce%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fm.dailyhunt.in%2Fnews%2Findia%2Ftelugu%2Fsakshitelugu-epaper-dhe1cfbf6803be41c6aa8f8951bc024dd8%2Fpraamukhyatakalginaraajyaangadinotsavaanniandarugurtinchaalivaiesjagan-newsid-n640814045

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago