YS Rajashekhar Reddy : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలామంది ముఖ్య మంత్రులు వచ్చారు. అయితే జనాలలో గుర్తుండిపోయే వారిలో వైస్ రాజశేఖర్ రెడ్డి ఒకరు. ఎవరూ ఊహించని సమయంలో ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వికరించి అందరినీ అశ్చర్యపరిచాడు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మంచి మంచి కార్యక్రమాలతో దూసుకెలుతు బలంగా వున్న సమయంలో గెలిచారు. ఒకసారి కాదు వరుసగా రెండవసారి కూడా విజయం సాధించడం విశేషం. కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ముఖ్యమంత్రి అంటే జనాలలో ఒక రబ్బర్ స్టాంప్ అన్న అభిప్రాయాన్ని వైస్ రాజశేఖర్ రెడ్డి తొలగించారు.
మండు వేసవిలో 1500 కిలోమీటర్ల పాద యాత్ర…
కాంగ్రెస్ పార్టీ పెద్దల నిర్ణయాలు కాకుండా తన సొంత నిర్ణయాలతో జనంలో ముఖ్యమంత్రి గా మంచి పేరు సంపాదించుకున్నాడు. 2003 లో ప్రతిపక్షంలో వున్నపుడు మండు వేసవిలో 1500 కిలోమీటర్ల పాదయాత్ర చేసి జనం దగ్గరకు వెళ్లి వారి సమస్యలను, కష్టాలను నేరుగా తెలుసుకోవడమే కాకుండా, అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వ నిర్ణయాలపై ప్రజలలో వ్యతిరేకత తీసుకు రావడంలో సఫలమయ్యారు.
పాదయాత్ర సమయంలో విన్న జనాల సమస్యల ఆధారంగా వారి ఎన్నికల మేనిఫెస్టో రూపొందించారు. అంతే కాదు రైతుల కోసం ఉచిత విద్యుత్ హామీ ప్రకటించారు. ఇంకా ఎన్నో సంక్షేమ పథకాల హామీలతో పాటు, ఈయన హయాంలోనే వృద్దులకు పెన్షన్ పెంచడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానం వద్దు అన్న నిర్ణయాలు కూడా పట్టు బట్టి ఈయన తీసుకోవడం తో జనంలో ఈయన మీద నమ్మకం పెరిగింది అని చెప్పుకోవచ్చు. పాదయాత్రతో వైస్ ను నమ్మిన జనాలు ఆయనకు పట్టం గట్టారు. వైస్ కూడా ప్రజల నమ్మకానికిని తగ్గట్టు జనం గుండెల్లో ఉండేలా హామీలను ఇవ్వడం, వాటిని అమలు చేయడం చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…