Featured

YS Sharmila : షర్మిలది తెలంగాణలో గమ్యంలేని ప్రయాణమా? పీక్స్‌కి వెళ్లిన పబ్లిసిటీ పిచ్చి.. తేడాలోస్తే అంతే సంగతులు.. జర జాగ్రత్తమ్మా..!

YS Sharmila : రాజకీయాల్లోకి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల అడుగు పెట్టారనగానే ఎంతో కొంత జనాలకు ఏదో మేలు చేస్తుందిలే అని అంతా భావించారు. నిజానికి ఆమె తెలంగాణలో పార్టీ పెట్టడమే పెద్ద చర్చనీయాంశంగా మారింది. అదేమంటే మా అత్తారిల్లు అంటుంది. ఆమె అత్తారిల్లు ఏదనేది అందరికీ పెద్ద క్వశ్చనే. పోనీలే ఎక్కడ పార్టీ పెడితే ఏం కానీ.. ఒక పార్టీ అధినేత నడుచుకునే తీరంటూ ఒకటి ఉంటుందిగా..!

హీరోయిన్లు సోషల్ మీడియాను తన వైపు తిప్పుకునేందుకు యత్నిస్తున్నారంటే దానికో అర్ధముంది. కానీ రాజకీయ నేతలు యత్నించడమేంటి.. విడ్డూరం కాకపోతేనూ. ప్రతి ఒక్కసారి షర్మిల కేవలం సోషల్ మీడియాలో హైలైట్ అవడానికే యత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. ఎంతసేపూ వివాదాలే. ఒక పార్టీ పెట్టినప్పుడు జనాల్లోకి ఎలా వెళ్లాలి? పాలకపక్షం తప్పులను జనాల్లోకి తీసుకెళ్లడం ఎలా? అసలు పార్టీ అధినేతగా ఎంత హూందాగా ఉండాలి? అన్నీ మరిచి రచ్చ చేస్తున్నారు. పోనీ సాధించిందేమైనా ఉందా? ఇప్పటి వరకైతే ఏమీలేదనేది బహిరంగ రహస్యమే.

వీరనారిలా ఫీలై పోయారు..

నిన్నటికి నిన్న షర్మిల ఏదో టీఎస్‌పీఎస్‌స్సీ ప్రశ్న పత్రాల లీకేజీపై సిట్‌ అధికారులను కలిసేందుకు వెళ్లారని నిర్ణయించారు. ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. నిజానికి ఆమెను వెళ్లనిస్తే ఏ గొడవ ఉండకపోయేది. కానీ బంజారాహిల్స్‌ పోలీసులకు మరి ఎక్కడి నుంచి ఆదేశాలొచ్చాయో కానీ అడ్డుకున్నారు. ఇక షర్మిల వీరనారిలా ఫీలై పోయారు. అడ్డుకున్న పోలీసులను నెట్టుకుంటూ ముందుకెళ్లి కారెక్కారు. కారును అడ్డుకునేందుకు యత్నించినా పోలీసులపైకి కారును పోనివ్వాలంటూ డ్రైవర్‌కు ఆదేశాలిచ్చారు. ఒక కానిస్టేబుల్‌పైకి కారు టైర్ ఎక్కడంతో ఆయన కాలికి గాయమైంది. ఇక బంజారా హిల్స్ ఎస్సై వచ్చి కారు కీని లాక్కున్నారు. ఇక అంతే.. ఎస్సైతోపాటు ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల చెంపలు ఛెల్లుమనిపించారు. నిన్నంతా మీడియాలో ఒక రచ్చ కాదు. పోనీ ఇంత చేస్తే ఆమెకు వచ్చిందేంటి? ఆమె వ్యవహార శైలిని ఏ ఒక్కరూ హర్షించలేదు. పిసరంత కూడా పొలిటికల్ మైలేజి రాలేదు సరికదా.. కావల్సినంత నెగిటివిటీ ఆమెకు వచ్చింది.

ఇజ్జత్ మొత్తం పాయే..!

నిన్న షర్మిల చేసిన రాద్దాంతానికి అనుకున్న మైలేజ్ రాకపోకా ఇజ్జత్ మొత్తం పోయింది. సోషల్ మీడియాలో ముఖ్యంగా ఒక కౌంటర్ తెగ వైరల్ అవుతోంది. నిజానికి ఆమె అనుకున్నది ఒకటి.. జరిగింది మరొకటి. ఎస్సై సహా కానిస్టేబుళ్లు షర్మిలను అడ్డుకునేందుకు యత్నించారు. కానీ ఆమె అస్సలు వెనక్కి తగ్గలేదు. పైగా రోడ్డుపై బైఠాయించారు. మీకేం అధికారం ఉందని తనను ఆపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పనీ పాటా లేకపోతే వెళ్లి గాడుదుల్ని కాసుకోండి’ అంటూ ఎస్సైపై ఫైర్ అయ్యారు. అయితే దానికి వెంటనే ఎస్సై.. ‘ఇప్పుడు అదే చేస్తున్నాం’ అన్నారు. అసలు కనీసం ఎస్సై ఇచ్చిన కౌంటర్ తనకు అర్ధమై ఉండదనేది మాత్రం స్పష్టం. లేదంటే తనను గాడిద అన్న ఎస్సైని ఊరుకుంటారా? అసలే కర్తవ్యం మూవీలో విజయశాంతి మాదిరిగా ఆమె ఫైటింగ్స్ చేస్తోంది కదా. ఇప్పుడీ కౌంటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. ఒకే ఒక్క మాటతో ఇజ్జత్ మొత్తం పోయింది కదా.

స్పాట్‌లో కౌంటర్లు, ట్రోలింగ్స్..

ఈ వ్యవహారం మొత్తంలో ఆమె సాధించింది ఏమీ లేదు. విధులలో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడిన కేసులో వైఎస్ షర్మిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. నాంపల్లి కోర్టు షర్మిలకు 14 రోజుల జ్యుడీషియల్ రీమాండ్ విధించింది. పోలీసులు ఆమెను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. ప్రస్తుతం నడుస్తున్నది.. సోషల్ మీడియా యుగం. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. నోటిని, చేతిని అదుపులో పెట్టుకోవాలి. లేదంటే స్పాట్‌లో కౌంటర్లు, ట్రోలింగ్స్.. నానా రచ్చ. ఇప్పుడు సోషల్ మీడియాలో విషయమంతా పక్కకుబోయే కేవలం ఎస్సై కౌంటర్ మాత్రమే బీభత్సంగా వైరల్ అవుతోంది. ఇప్పటికైనా షర్మిత తన స్ట్రాటజీస్ మార్చుకోవాలి. చక్కని స్క్రిప్ట్‌తో మాట్లాడాలి. చేసే ప్రతి పనిలోనూ హూందాగా వ్యవహరించాలి. లేదంటే ఇప్పుడు కేఏ పాల్‌తో పోలుస్తున్నారు. మార్చుకోకుంటే ఆమెతోనే వేరొకరిని కంపేర్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. పబ్లిసిటీ కోసం కాకుండా.. ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలని… ఇకనైనా కాస్త బుర్రకు పదును పెట్టాలంటూ సొంత పార్టీ నేతలే సూచిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది కలిసొస్తుందంటున్నారు. మరి ఎంతమేర కలిస్తుందో వేచి చూడాలి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

భర్తను చంపేందుకు భార్య మాస్టర్ ప్లాన్.. చివరికి తానే చిక్కుల్లో!

కడప జిల్లాలో సంచలనం రేపిన ఓ హత్యాయత్నం కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. దాంపత్య కలహాలు తీవ్రరూపం దాల్చడంతో భర్తను…

22 minutes ago

‘కమ్సహమ్నిదా’ మేకింగ్ వీడియో వైరల్.. వరుణ్ తేజ్ మూవీకి హైప్ పెరిగింది!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. హారర్…

46 minutes ago

వరుస ఫ్లాప్‌ల తర్వాత నితిన్ కొత్త గేమ్ ప్లాన్.. సితార బ్యానర్‌లో భారీ ప్రాజెక్ట్!

వరుస పరాజయాలతో కొంత వెనుకబడిన యువ హీరో నితిన్, ఈసారి హిట్ ట్రాక్‌లోకి రావాలనే లక్ష్యంతో కొత్త ప్రాజెక్ట్‌ను ఎంపిక…

50 minutes ago

‘వైద్యో నారాయణో హరి’ని నిజం చేసిన రాజశేఖర్.. స్టార్ కూతురి ప్రాణాలు కాపాడిన కథ!

సినిమాల్లో యాంగ్రీమ్యాన్‌గా గుర్తింపు పొందిన సీనియర్ నటుడు రాజశేఖర్, నిజ జీవితంలో మాత్రం ఎంతో మానవతా భావంతో కూడిన వైద్యుడని…

56 minutes ago

ఓటమి తర్వాత హార్దిక్ ప్రవర్తనపై చర్చ.. కెప్టెన్‌గా ఒత్తిడి పెరుగుతుందా?

ఐపీఎల్ 2026 సీజన్ ముంబై ఇండియన్స్‌కు కష్టకాలంగా మారింది. వరుస ఓటములతో ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న జట్టుకు, చెన్నై సూపర్…

1 hour ago

కిస్ సీన్ చేస్తూ షాక్ అయ్యా.. కాజోల్ సంచలన కామెంట్స్!

బాలీవుడ్ నటి కాజోల్ తాజాగా తన కెరీర్‌కు సంబంధించిన ఒక ఆసక్తికర అనుభవాన్ని పంచుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో…

1 hour ago