Aliya Bhatt: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన అలియా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ నిర్మాత మహేష్ భట్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆలియా తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది.
బాలీవుడ్ లో మాత్రమే కాకుండా సౌత్ లో కూడా ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవల రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయింది. ఇది ఇలా ఉండగా తాజాగా ఆలియా భట్ గురించి ఒక వార్త వైరల్ అవుతోంది. తాజాగా ఈ అమ్మడు రూ.37 కోట్లు ఖరీదు చేసే విలువైన ఇంటిని ముంబై లో కోనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
బాలీవుడ్ లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో ఆలియా భట్ కూడా ఒకరు. దీంతో ఈ అమ్మడు భవిష్యత్తులో నిర్మాణ రంగం వైపు అడుగులు వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తనకు సంబంధించిన ప్రొడక్షన్ హౌస్ పేరిట ముంబైలో రూ. 37 కోట్లు వెచ్చించి ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది..ఇప్పటికే ఆలియా పేరిట రెండు ఖరీదైన ఇల్లు ఉన్నాయి. అందులో 8 కోట్ల రూపాయల విలువచేసే ఒక ఇంటిని తన చెల్లికి ఇచ్చినట్లు తెలుస్తోంది. మరొక ఇంట్లో ప్రస్తుతం ఆలియా, రణబీర్ కలిసి ఉంటున్నారు.
ఇటీవల ఆలియా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా కూతురి కోసం సినిమాలకు దూరంగా ఉంటున్న ఆలియా ప్రస్తుతం సినిమాల మీద మళ్లీ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. మరొకవైపు రణబీర్ కుడ కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…