YS Sharmila: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో కూటమి నేతల గురించి సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేసిన వారిపై ఉక్కు పాదం మోపుతున్నారు. అయితే ఈ విషయంలో కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్ షర్మిల పూర్తి మద్దతు తెలిపారు. ఇలా సోషల్ మీడియాలో తన గురించి తన తల్లి గురించి అలాగే తన సోదరి సునీత గురించి జగన్మోహన్ రెడ్డి అతని పార్టీ నేతలు ఎన్నో అసభ్యకరమైన పోస్టులు చేసే హింసించారని మండిపడ్డారు.
ఇలా సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి తగిన శిక్ష పడాలని ఈమె డిమాండ్ చేశారు. ఇక వైయస్ అవినాష్ రెడ్డి సమక్షంలో కూడా ఇలా సోషల్ మీడియా చిత్రహింసలు జరిగాయని తనని ఎందుకు ఇంకా విచారించలేదని ఈమె పోలీసులను ప్రశ్నించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైసిపి కార్యకర్తలు చేస్తున్నటువంటి ఇలాంటి దారుణాల వెనుక సజ్జల భార్గవ్ ఉన్నారని ఈమె గుర్తు చేశారు.
సజ్జల భార్గవ్ సోషల్ మీడియా హెడ్ అని ముందు పెద్ద తలకాయలను శిక్షిస్తే అందరూ అలర్ట్ అవతారని షర్మిలా తెలిపారు. సజ్జల భార్గవ్ ఎక్కడ దాగున్న ఏ ప్యాలెస్ లో దాక్కున్నా కూడా అరెస్టు చేయాలని తెలిపారు. పరోక్షంగా సజ్జల భార్గవ్ జగన్ ఇంట్లో ఉన్న ఉపేక్షించేది లేదని అరెస్టు చేయాలని ఈమె తెలియజేశారు.
ఒక పార్టీ అధ్యక్షురాలుగా తాను వీటిపై కేసు నమోదు చేస్తే రాజకీయాల పరంగా ఇబ్బందులు తలెత్తుతాయని తాను మౌనంగా ఉన్నట్లు షర్మిలా తెలిపారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్ చిన్నాన్న హత్య కేసులో పురోగతిని కోరుకున్నారు. ఈ ప్రభుత్వ హయామంలో అయినా తన చిన్నమ్మ సౌభాగ్యమ్మ సునీతకు న్యాయం జరగాలని షర్మిల కోరారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…