Political News

YS sharmila: వైయస్ జగన్ అరెస్ట్ కు షర్మిల డిమాండ్… కౌంటర్ ఇచ్చిన వైసీపీ!

YS sharmila: అదానీ నుంచి విద్యుత్ కొనుగోళ్లకు జగన్మోహన్ రెడ్డి భారీ స్థాయిలో లంచం తీసుకున్నారు అంటూ వైఎస్ షర్మిల అలాగే కూటమి ప్రభుత్వ నేతలు ఆరోపణలు చేస్తున్నారు ఇలాంటి ఆరోపణలు వస్తున్నటువంటి తరుణంలో వైయస్సార్ జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించి తనపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసిన తన పరువుకు భంగం కలిగించిన వంద కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తానని వెల్లడించారు..

ఇకపోతే తాజాగా వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై వైకాపా మాజీ ఎంపీ రాచమల్లు శివప్రసాద్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ షర్మిల చేసే వ్యాఖ్యలలో ఏమాత్రం నిజం లేదని తప్పు పట్టారు. అసలు అదానీ జగన్మోహన్ రెడ్డికి డబ్బులు ఇచ్చారని రాధాకృష్ణ రామోజీరావు కుమారుడు షర్మిల చూసినట్టు మాట్లాడుతున్నారు. అధికారులకు లంచం ఇచ్చే ప్రయత్నం చేశారు అని చార్జిషీట్ లో ఉంటే, జగన్ కు 1750 కోట్లు లంచం ఇచ్చారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.

అదానీ నుంచి కేంద్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేయగా కేంద్ర ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి సెకీ సమస్థతో ఒప్పందం కుదుర్చుకొని అత్యంత తక్కువ ధరకే ప్రజలకు విద్యుత్ అందించాలన్న ఉద్దేశంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారే తప్ప అడానీకి జగన్మోహన్ రెడ్డికి మద్యం ఏమాత్రం సంబంధం లేదు. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ తప్పుడు ప్రచారాలను చేస్తున్నారని మండిపడ్డారు.

YS sharmila: వ్యక్తిగత కక్షలు..

ఇక షర్మిల తన వ్యక్తిగత కక్షలను ఇలా రాజకీయం చేసే జగన్మోహన్ రెడ్డిని ప్రజలలో తప్పుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రజలను గాలికి వదిలేసి అబద్ధలను ఆస్త్రాలుగా చేసుకున్నారని మండిపడ్డారు. అప్పటి క్యాబినెట్ చర్చల తరువాత 2.49 పైసలకే విద్యుత్తు కొనుగోలు చేసింది. చంద్రబాబు గతంలో ఇదే సెకి ద్వారా 5.30 పైసలతో విద్యుత్ కొనుగోలు చేశారని ఈయన క్లారిటీ ఇచ్చారు. ఇలా జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయమంటూ డిమాండ్ చేస్తున్న షర్మిల అదే డిమాండ్ చంద్రబాబు మోడీపై చేసే ధైర్యం ఉందా అంటూ ప్రశ్నించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago