Nagababu: పవన్ కళ్యాణ్ గత మూడు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే ఈయన నరేంద్ర మోడీతో పాటు ఇతర కేంద్ర మంత్రులను కూడా కలిసి పలు విషయాల గురించి చర్చలు జరుపుతున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లడం వెనుక ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ వెనుక తన స్వార్ధ రాజకీయాలు ఉన్నాయి అంటూ కూడా ఆయనపై విమర్శలు వచ్చాయి. త్వరలోనే రాజ్యసభకు జరగబోయే మూడు పదవుల ఎన్నికలలో భాగంగా జనసేన నుంచి తన అన్నయ్య నాగబాబును పెద్దల సభకు పంపించాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారని అందుకు అనుగుణంగానే ఢిల్లీ వెళ్లి పెద్దలతో చర్చలు జరుపుతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.
నాగబాబుకు రాజ్యసభ సభ్యుడిగా పదవి ఇప్పించడం కోసమే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారని ఆరోపణలు వస్తున్న తరుణంలో నాగబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా నాగబాబు పవన్ ఢిల్లీ టూర్ వెళ్లడం వెనక ఎలాంటి స్వార్థ రాజకీయాలు లేవని ఆయన ప్రజా శ్రేయస్సు కోసమే ఢిల్లీ వెళ్లారని తెలిపారు.
వ్యక్తిగత స్వార్థానికి అతనెప్పుడు దూరంగానే వుంటాడని స్పష్టం చేశారు. అలాగే అతను ఎప్పుడు సత్యానికి, ధర్మానికి కట్టుబడి ఉంటాడని, మన రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్తాడు.. పోరాడతాడని తెలిపారు. ప్రస్తుతం తాను ఢిల్లీ వెళ్లిన ఉద్దేశం కూడా అదేనని తెలిపారు. ఇక అలాంటి నాయకుడికోసం నా లైఫ్ ని ఇవ్వటానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటానని చెబుతూ.. నా నాయకుడికి సేవ చేయడం తప్ప నాకు వేరే రాజకీయ ఆశయం లేదని నాగబాబు వ్యాఖ్యానించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…