Political News

YS Jagan: అలాంటి చర్యలకు పాల్పడితే 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తా: వైయస్ జగన్

YS Jagan: వైకాపా అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన అదానీ ముడుపుల వ్యవహారం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కూటమినేతలు అలాగే ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సైతం ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని తప్పుపడుతున్న క్రమంలో ఈయన ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ..FBI చార్జ్ షీట్లో తన పేరు ఎక్కడా లేదని స్పష్టం చేశారు.అదానీ మన రాష్ట్రంలో చాలా కంపెనీలు ఉన్నాయి ఆయనతో భేటీకి విద్యుత్ ఒప్పందానికి ఏ మాత్రం సంబంధం లేదని జగన్ తెలిపారు. నాకు లంచం ఇచ్చినట్టు చాలామంది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అందుకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటూ ఈయన ప్రశ్నించారు.

ఇలా వాస్తవాలు తెలియకుండా కొంతమంది నా గురించి తప్పుడు ప్రచారాలను చేస్తూ నా పేరు ప్రతిష్టలకు పరువుకు భంగం కలిగేలా చేస్తున్నారు ఇకపై ఎవరైనా నా పరువు ప్రతిష్టలను దెబ్బతీసేలా కనుక మాట్లాడితే తప్పనిసరిగా వారిపై 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తాను అంటూ ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

YS Jagan:పరువు నష్టం దావా..

ఇకపోతే ఈయన చేసిన ఈ కామెంట్స్ పరోక్షంగా తన చెల్లి షర్మిలను ఉద్దేశించి చేశారని తెలుస్తుంది.అదానీ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈమె వైయస్ జగన్మోహన్ రెడ్డితో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయాలని ఆయన పై సిబిఐ ఎంక్వయిరీ వేయాలని తనని అరెస్టు చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోనే జగన్ ఇలా స్పందించారని తెలుస్తుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

6 hours ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

2 days ago

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకకు ముప్పు తెస్తున్న కొత్త జీవనశైలి ఇదే!

ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…

2 days ago

మధుమేహం, గుండె జబ్బులు లేకుండా పిల్లలు పుడతారా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది!

వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…

2 days ago

కరివేపాకుతో బరువు తగ్గొచ్చా? రోజూ ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…

2 days ago

83 ఏళ్ల వయసులోనూ అదే కసి.. ఒక సీన్ కోసం నిద్ర మానేసిన అమితాబ్ బచ్చన్!

సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…

2 days ago