జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాశులకు.. శుక్ర గ్రహానికి అవినాభావ సంబంధం ఉంది. శుక్రగ్రహం వివిధ రాశుల వారి మధ్య ప్రేమను, ఆకర్షణను, పెళ్లి వంటి ప్రభావాన్ని చూపుతుంది. అదే విధంగా కొన్ని రాష్ట్రాల వారి మధ్య శుక్ర గ్రహం తీవ్రమైన ప్రభావాన్ని చూపుతూ వారు విడిపోవడానికి కారణం అవుతుంది. ఈ విధంగా కొన్ని రాశుల వారికి శుక్ర గ్రహం కలిసి రాదు.
ప్రేమ అనేది ఎంతో సున్నితమైనది. అవతలి వారి మనస్తత్వాన్ని బట్టి మెలిగితే ప్రేమికులు కలకాలం ఎంతో అన్యోన్యంగా ఉంటారు. కానీ ప్రేమలో విఫలమైన వారు ఎన్నో ఇబ్బందులు పడుతూ కొన్నిసార్లు మానసికంగా దెబ్బతినే పరిస్థితి కూడా తలెత్తుతుంటాయి.ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ రాశుల వారితో జాగ్రత్తగా ఉండాలని… ఈ రాశుల వారిని ప్రేమిస్తే వారి జీవితంలో బ్రేకప్ తప్పకుండా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి ఆ రాశులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
ధనస్సు రాశి: ఈ రాశి వారు ఎంతో సాహసోపేతమైన వారు. ఈ రాశి వారు ఎప్పుడూ స్వతంత్రంగా ఉండటం కోసం భావిస్తారు. వీరు ఎక్కువ కాలం ఒక బంధంతో ఇమిడి ఉండలేరు. ఈ రాశి వారు ఎక్కువగా ట్రావెలింగ్ చేయడానికి ఇష్టపడుతుంటారు. అందువల్ల వీరు వీరు జీవితంలో బంధాలకు బాంధవ్యాలకు పెద్దగా విలువ ఇవ్వరు. ఒకవేళ ఈ రాశి వారు ఇతరులతో సంబంధం ఏర్పరచుకున్న అది మూడునాళ్ళ ముచ్చటే. వీరు ఇతరులతో బ్రేకప్ చెప్పడానికి ఏ మాత్రం ఆలోచించకుండా బ్రేకప్ చెప్పేస్తుంటారు.
కుంభరాశి:
కుంభ రాశి వారు స్వయంగా ఆనందం, ప్రేరణ, ప్రోత్సాహం, ప్రేరేపితం పొందుతారు. స్వతంత్రంగా ఉండాలని ఈ రాశి వారు కూడా కోరుకుంటారు. వీలైనంత వరకు ఈ రాశివారు ప్రపంచం నుంచి దూరంగా ఉండడానికి ఇష్టపడుతుంటారు. ఈ రాశి వారికి బంధాలు బాంధవ్యాలు స్నేహితులు నుంచి పెద్దగా ఆనందాన్ని పొందలేరు.కనుక ఇటువంటి వ్యక్తిత్వం గల రాశి వారితో ప్రేమలో పడితే వారి నుంచి తొందరగా విడిపోవడమే ఉంటుంది.
సింహరాశి: సింహ రాశి వారు ఎల్లప్పుడూ ఇతరుల నుంచి పొగడ్తలను గొప్పలను కోరుకుంటారు. అందరికీ సింహ రాశి వారు ఎంతో ఆకర్షణ గా నిలవాలని భావిస్తారు.వీరి జీవితంలో వచ్చిన భాగస్వాములు సైతం ఎల్లప్పుడు వీరిని పొగుడుతూ ఉండాలని మనస్తత్వం కలిగి ఉంటారు. ఈ క్రమంలోని వీరి మధ్య మనస్పర్థలు తలెత్తి బ్రేక్ అప్ కి దారితీస్తాయి. తమకి విలువ లేని చోట ఉండే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పి విడిపోతారు. కనుక ఈ మూడు రాశుల వారితో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…