కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

1
353

టీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి కెసిఆర్ తనయుడు రాష్ట్ర మంత్రి కేటీఆర్ పట్టాభిషేకానికి లైన్ క్లియర్ అయిపొయింది. మున్సిపల్ ఎన్నికల్లో తెరాస ఘన విజయం నేపథ్యంలో ఈ దిశగా కెసిఆర్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. సీఎం కెసిఆర్ జాతీయ రాజకీయాల్లో తన పాత్ర ఎలా ఉండబోతోంది అని చెప్పకనే చెప్పారు. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను కలిపే బాధ్యతతో మరోసారి కీలక భూమిక దిశగా అడుగులు వేయనున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికల్లో విజయంపైనా ప్రత్యేకంగా కేటీఆర్ పేరు ప్రస్తావించి ఆశీస్సులు అందజేశారు.

అదేసమయంలో మంత్రులు కొంతకాలంగా కేటీఆర్ ను ఉద్దేశించి చేస్తున్న ప్రకటనలపైన ముఖ్యమంత్రి చేసిన వ్యాఖలతో స్పష్టత వచ్చినట్టే కనిపిస్తోంది. సమయం, సందర్భం కోసం మాత్రమే ఎదురు చూస్తున్నట్టు తేలిపోయింది. ఇదే సమయంలో మున్సిపల్ ఫలితాల తరువాత అటు పార్టీలో, ఇటు ప్రగతి భవనంలో కేటీఆర్ పేరు మారు మ్రోగిపోతోంది. కేసీఆర్ తిరిగి జాతీయ రాజకీయాల దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత తనయుడు కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 31 జిల్లా పరిషత్తులు గెలుచుకోవడంతో, మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్ష విజయంతో కేటీఆర్ సమర్ధత ఏంటో పార్టీ నేతలకు, ప్రజలకు తెలియజేయటంలో కేసీఆర్ విజయం సాధించారు. ఇక కొంత కాలంగా మంత్రులు పోటీపడి మరీ కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో జాతీయ రాజకీయాలు, కాంగ్రెస్, బీజేపీయేతర నేతలను ఏకం చేయడంకోసం ఇతర పార్టీల ముఖ్యమంత్రుల సమావేశానికి కేసీఆర్ లీడ్ తీసుకున్నారట. దీని ద్వారా తెలంగాణలో ప్రభుత్వ, పార్టీ భాద్యతలను తనయుడు కేటీఆర్ కు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చారన్నది అయన మాటల్లోనే వ్యక్తమైనట్టు భావించాల్సి ఉంది. కొంతకాలంగా కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం గురించి పార్టీలో పెద్దఎత్తున చర్చ సాగుతుంది. ఆ సమయంలో కెసిఆర్ జాతీయ రాజకీయాల పైన ఫోకస్ చేస్తూనే పార్టీ అధ్యక్షుడిగా, ప్రభుత్వాన్ని సలహాలిచ్చే చట్టబద్ధ సంఘానికి చైర్మన్ గా ఉంటారంటూ పార్టీలోని సీనియర్ నేతలు పలు సందర్భాల్లో వ్యాఖానించారు.

తాజాగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల తరువాత క్యాబినెట్ మంత్రుల ప్రకటనలో విష్ ఫుల్ థింకింగ్ గా వాళ్ళు, వీళ్ళు అంటున్నారని కాదని సమయం సందర్భం చూసుకుని నిర్ణయం ఉంటుందని చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ, కలిసి వచ్చే పార్టీల సీఎంలతో కలిసి పోరాడతానని, దేశంకోసం జాతీయ రాజకీయాలలోకి వెళ్తానని ప్రకటించారు. దీని ద్వారా కేటీఆర్ కు పట్టాభిషేకం ఖాయమని కేసీఆర్ వ్యాఖల సారాంశం అంటూ పార్టీ నేతలు అంచనాకి వస్తున్నారు. ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపు వెనక కేటీఆర్ ప్రస్తావన స్వయంగా కేసీఆర్ తీసుకురావడంతో పాటుగా ప్రత్యేకంగా ఆశీస్సులు అందజేశారు. 2024 లో ఫెడరల్ ఫ్రెంట్ దే అధికారం అనే ధీమాలో కేసీఆర్ ఉన్నారు. దీనితో కుమారుడికి పీఠం అప్పగింత నిర్ణయం తీసుకోడానికి ఆయనకు ఎక్కువ సమయం పట్టదని అభిప్రాయ పడుతున్నారు.

అయితే నెలరోజుల్లో జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకం అవుతానని వెల్లడించడంతో అతి స్వల్ప వ్యవధిలోనే కేటీఆర్ సీఎంగా కొలువుదీరవచ్చని అంటున్నారు. తాజాపరిణామాలతో కేటీఆర్ కు తెలంగాణ భవన్ లో అభినందనలు వెల్లువెత్తాయి. దీనితో కేటీఆర్ కు పగ్గాలు అప్పగించేందుకు దాదాపు నిర్ణయం అయినట్టేనని, సమయానుకూలంగా ముహూర్తం మాత్రమే ఖరారు చేయాల్సి ఉందని పార్టీనేతలు అంచనా వేస్తున్నారు. ఇక ఫిబ్రవరిలో కేసీఆర్ కుటుంబం ఒక యాగం తలపెట్టింది. ఆ తరువాత కేటీఆర్ కు పట్టాభిషేకం ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here