“రష్మిక మందన్న” తెలుగునాట నేడు పరిచయం అక్కర్లేని పేరు.. 2018 లో నాగ సౌర్య హీరోగా నటించిన “ఛలో” చిత్రంలో తెలుగింట అడుగుపెట్టింది. మొదటి చిత్రంతోనే ఈ భామ తెలుగు ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టింది. చలో ఇచ్చిన జోష్ తో, విజయ్ దేవరకొండ సరసన నటించిన “గీత గోవిందంతో” తెలుగు వారికి మరింత దగ్గరైపోయింది. తరువాత వరుసగా “దేవదాసు”, “డియర్ కామ్రేడ్”, నిన్న వచ్చిన సూపర్ స్టార్ సినిమా తో “సరిలేరు నీకెవ్వరు” అనిపించింది. ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా వెలిగిపోతోంది. వచ్చే నెలలో నితిన్ హీరోగా “భీష్మ” తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దేనితోపాటు అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ఒక సినిమా చేస్తుంది.

ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఫిట్ నెస్ కాపాడుకోడానికి జిమ్ బాట పట్టింది. సోషల్ మీడియాలో ఫిట్ నెస్ మంత్రా తో తెగ హల్ చల్ చేస్తుంది. వీలు దొరికినప్పుడల్లా జిమ్ లో తన అందాలకు మెరుగు పడుతుంది. అయినా ఈ రోజుల్లో హీరోయిన్లు తమ ఫిట్ నెట్ పైన బాగా ద్రుష్టి పెట్టారు. మరో పక్క రకుల్ ప్రీత్ “F45” పేరుతో ఒక జిమ్ నే మొదలు పెట్టేసింది. పనిలో పనిగా తన కొవ్వు కరించుకునే పనిలో ఫుల్ బిజీ అయిపోయింది. సమంత కూడా ఎక్కువ సమయం జిమ్ లోనే గడుపుతుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here