Categories: FeaturedMovie News

అప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరో నిజంగా నాకు తెలియదంటున్న వాసుకి..!?

సినిమా ఓ రంగుల ప్రపంచం.. చూడటం వరకే మన చేతుల్లో ఉంటుంది.ఒకసారి సినిమా చూసిన తర్వాత ఆ రంగుల ప్రపంచంలో నుంచి విముక్తులు కావడం అంత సులువు కాదు. అలా ఎంతో మంది కలలు కని ఆరాధించి సినిమా తమ శ్వాసగా, ప్రాణంగా అభిమానించి, ఆ సినీ జగత్తులో ఇసుక రేణువునైనా సరిపోతుందని కష్ట నష్టాలను భరిస్తూ.. అనుకున్న లక్ష్యాన్ని చేరిన దర్శకుడు కరుణాకరన్. చెన్నైలో పాండీ బజార్ లో తిరుగుతూ దర్శకులకు నిర్మాతలకు తను కలలుకంటూ రాసుకున్న కథను వినిపిస్తూ ఉండేవాడు. అలా పాండీ బజార్ లో అనుకోకుండా ఒక హోటల్ లో టాలీవుడ్ కు చెందిన పవన్ కళ్యాణ్ ఫోటోను ఒక మ్యాగజైన్ పై చూసి తన కథకు సరిగ్గా సరిపోతాడనుకున్నాడు.

అనుకున్నదే తడవుగా ఆయన హైదరాబాదుకు ప్రయాణమై అష్టకష్టాలు పడి పవన్ కళ్యాణ్ అపాయింట్ మెంట్ సంపాదించగలిగాడు. అలా తను చెప్పిన ప్రేమ కథకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడంతో ఒక్కసారిగా ఎడారిలో బిస్లరీ వాటర్ దొరికినట్టుగా కరుణాకరన్ ఫీల్ అయ్యాడు. కథలో అత్యంత ప్రాధాన్యం ఉన్నా పాత్ర హీరో చెల్లెలు పాత్ర. అప్పుడు తనకు సరిగ్గా తమిళ్ సీరియల్ లో నటిస్తున్న వాసుకి గుర్తుకొచ్చారు. కానీ వాసుకి అప్పటికే తాను సినిమాల్లో నటించనని భీష్మించుకుని కూర్చుంది. విజయ్ కాంత్ హీరోగా నటిస్తున్న సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్ కోసం వాసుకి ఆఫర్ వచ్చింది. అప్పటికే ఖుషి సినిమా దర్శకుడు ఎస్.జె.సూర్య ఒక కథ చెప్పి వెళ్లిపోయారు. ఆ తరువాత దర్శకుడు కరుణాకరన్ వెళ్లి వాసుకిని కలిశారు. వాసుకి లోలోపల కరుణాకరన్ ఎలా కథ చెప్పినా కూడా.. నేను సినిమాలో నటించినని మనసులో అనుకుంది.

వాసుకి, కరుణాకర్ చెప్పే ప్రేమకథ వినడం మొదలు పెట్టింది. ఆ కథ ఆయన దాదాపు ఏడు సంవత్సరాల నుంచి ఎంతో స్ట్రగుల్ చేసి ఆ కథను రాసుకున్న విధానం వాసుకి ఎంతగానో నచ్చింది. ఈ సినిమా ఎవరితో తీస్తున్నావని అడగగా పవన్ కళ్యాణ్ తో తెలుగులో ఈ ప్రేమ కథ తీస్తున్నానని కరుణాకర్ చెప్పారు. కానీ కరుణాకరన్ ఆ కథ చెప్పే నాటికి నిజంగా తనకు పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తెలియదన్నారు. తాను ఎక్కువగా తమిళ్ సినిమాలు, సీరియల్స్ చూసేదానినని, అలా పవన్ కళ్యాణ్ అప్పటికీ నాకు తెలియదని ఆమె ఈ మధ్య కాలంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అలా1998లో కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన “తొలిప్రేమ”చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది.ఇందులో పవన్ కళ్యాణ్ చెల్లెలిగా నటించిన వాసుకి తెలుగులో మంచి పేరు వచ్చింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago