Categories: FeaturedMovie News

‘ఆ సినిమాలకు రాస్తూ బజార్లో తిరుగుతారో.. కమర్షియల్ సినిమాలకు రాసి కార్లో తిరుగుతారో.. మీరే తేల్చుకోండి’ అన్న దర్శకుడెవరు.?!

ఈ సోదరులు కార్మిక, కర్షక ,రైతు పక్షపాతులు కాబట్టి 1978 సినిమాల్లోకి అడుగు పెట్టిన తర్వాత వారు అలాంటి సినిమాలే తీయడం జరిగింది. ‘చలిచీమలు’ సినిమాతో మొదలైన వీరి ప్రయాణం నేటి ‘ఖైదీ నెంబర్ 150’ వరకు దాదాపు 42 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మూడువందల యాభై చిత్రాలకు కథ, మాటలు రాయడం మామూలు విషయం కాదు. పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన వెంకటేశ్వరరావు తాను ప్రభుత్వ ఆడిటర్ అయ్యుండి కూడా నాటకాలు వేస్తూ సినిమాలపై ఎక్కువగా‌ మోజు పడడం జరిగింది.

వెంకటేశ్వరరావు మొదటగా ‘సుడిగుండాలు’ అనే సినిమాలో నటించడం జరిగింది. హైదరాబాద్ రవీంద్రభారతిలో నాటకాలు వేస్తున్న వెంకటేశ్వరరావును చూసిన ఆదుర్తి సుబ్బారావు ఒక సినిమాలో హీరో వేషంకోసం తీసుకువచ్చారు. వెంకటేశ్వరరావుకు మేకప్ టెస్ట్ చేసి హీరో కి సూట్ కావు ఫ్రెండ్ క్యారెక్టర్ వేయమని ఆదుర్తి సుబ్బారావు అనడంతో.. కోపంతో వెంకటేశ్వరరావు వెళుతూ.. తిరిగి ఎప్పటికైనా మీరు పిలిస్తేనే వస్తానని శపథం చేసి వెళ్లిపోయాడు. అలా పది సంవత్సరాల తర్వాత సారథి స్టూడియో వారు నిర్మించే సినిమాకి సంభాషణలు రాయడానికి పరుచూరి వెంకటేశ్వరరావు తిరిగివచ్చారు.

పరుచూరి బ్రదర్స్ మరో మలుపు, సమాధి కడుతున్నాం చందాలివ్వండి, ఈ చరిత్ర ఏ సిరాతో, ఇది కాదు ముగింపు, రోజులు మారాయి లాంటి విప్లవాత్మక, సామాజిక సందేశ చిత్రాలను రాయడం మొదలుపెట్టారు. ఒకసారి 1984 సంవత్సరంలో రాఘవేంద్ర రావు.. కృష్ణం రాజుతో ఒక సినిమా చేద్దామనుకున్న సమయంలో పరుచూరి బ్రదర్స్ ని కథ రాయడం తో పరుచూరి బ్రదర్స్ రోజులు మారాయి, మరో మలుపు లాంటి సామాజిక చిత్రాలు చేయండని అనడంతో.. రాఘవేంద్ర రావు అలాంటి సినిమాలకు రాసి మీరు పాండీ బజార్లో తిరుగుతారో.. కమర్షియల్ సినిమాలు రాసి కార్లలో తిరుగుతారో మీ ఇష్టం అన్నారు. దానితో పరుచూరి బ్రదర్స్ రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా నటించిన ‘బొబ్బిలి బ్రహ్మన్న’ కథ రాయడం జరిగింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago