ఈ సోదరులు కార్మిక, కర్షక ,రైతు పక్షపాతులు కాబట్టి 1978 సినిమాల్లోకి అడుగు పెట్టిన తర్వాత వారు అలాంటి సినిమాలే తీయడం జరిగింది. ‘చలిచీమలు’ సినిమాతో మొదలైన వీరి ప్రయాణం నేటి ‘ఖైదీ నెంబర్ 150’ వరకు దాదాపు 42 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మూడువందల యాభై చిత్రాలకు కథ, మాటలు రాయడం మామూలు విషయం కాదు. పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన వెంకటేశ్వరరావు తాను ప్రభుత్వ ఆడిటర్ అయ్యుండి కూడా నాటకాలు వేస్తూ సినిమాలపై ఎక్కువగా మోజు పడడం జరిగింది.

వెంకటేశ్వరరావు మొదటగా ‘సుడిగుండాలు’ అనే సినిమాలో నటించడం జరిగింది. హైదరాబాద్ రవీంద్రభారతిలో నాటకాలు వేస్తున్న వెంకటేశ్వరరావును చూసిన ఆదుర్తి సుబ్బారావు ఒక సినిమాలో హీరో వేషంకోసం తీసుకువచ్చారు. వెంకటేశ్వరరావుకు మేకప్ టెస్ట్ చేసి హీరో కి సూట్ కావు ఫ్రెండ్ క్యారెక్టర్ వేయమని ఆదుర్తి సుబ్బారావు అనడంతో.. కోపంతో వెంకటేశ్వరరావు వెళుతూ.. తిరిగి ఎప్పటికైనా మీరు పిలిస్తేనే వస్తానని శపథం చేసి వెళ్లిపోయాడు. అలా పది సంవత్సరాల తర్వాత సారథి స్టూడియో వారు నిర్మించే సినిమాకి సంభాషణలు రాయడానికి పరుచూరి వెంకటేశ్వరరావు తిరిగివచ్చారు.
పరుచూరి బ్రదర్స్ మరో మలుపు, సమాధి కడుతున్నాం చందాలివ్వండి, ఈ చరిత్ర ఏ సిరాతో, ఇది కాదు ముగింపు, రోజులు మారాయి లాంటి విప్లవాత్మక, సామాజిక సందేశ చిత్రాలను రాయడం మొదలుపెట్టారు. ఒకసారి 1984 సంవత్సరంలో రాఘవేంద్ర రావు.. కృష్ణం రాజుతో ఒక సినిమా చేద్దామనుకున్న సమయంలో పరుచూరి బ్రదర్స్ ని కథ రాయడం తో పరుచూరి బ్రదర్స్ రోజులు మారాయి, మరో మలుపు లాంటి సామాజిక చిత్రాలు చేయండని అనడంతో.. రాఘవేంద్ర రావు అలాంటి సినిమాలకు రాసి మీరు పాండీ బజార్లో తిరుగుతారో.. కమర్షియల్ సినిమాలు రాసి కార్లలో తిరుగుతారో మీ ఇష్టం అన్నారు. దానితో పరుచూరి బ్రదర్స్ రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా నటించిన ‘బొబ్బిలి బ్రహ్మన్న’ కథ రాయడం జరిగింది.



























