Categories: FeaturedMovie News

జనతా గ్యారేజ్ సినిమాలో బాలకృష్ణను ఎందుకు తీసుకోలేదో తెలుసా? షాకింగ్ నిజాలు బయటపెట్టిన కొరటాల శివ?

మీకు జనతా గ్యారేజ్ సినిమా గుర్తుందా? జూనియర్ ఎన్టీఆర్ లోని మరో నటుడిని పరిచయం చేసిన సినిమా అది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఎన్నో సంచలనాలను సృష్టించింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాదు.. తెలుగు సినీ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. జనతా గ్యారేజ్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న పాత్ర మోహన్ లాల్ ది. ఆయన నిజానికి తెలుగు నటుడు కాదు.

ఆయన మలయాళం నటుడు. తెలుగులో మనకు మెగాస్టార్ చిరంజీవి ఎలాగో.. మలయాళంలో మోహన్ లాల్ అలాగ. ఆయన అక్కడ మెగాస్టార్. ఆయన మలయాళం సినిమాలు చాలా తెలుగులో డబ్ అవుతాయి కాబట్టి మనకు మోహన్ లాల్ పరిచయమే. కానీ.. ఆయన తెలుగులో డైరెక్ట్ గా ఏ సినిమాలోనూ నటించలేదు. చాలా తక్కువ సినిమాల్లో నటించారు. అందులో జనతా గ్యారేజ్ ఒకటి.

అసలు.. ఆ పాత్రకు మోహన్ లాల్ ను ఎందుకు కొరటాల ఎంచుకున్నారు?

నిజానికి.. తెలుగులో అటువంటి పాత్రలు చేయడానికి బోలెడు మంది నటులు ఉన్నారు కానీ.. కొరటాల శివ మాత్రం కేవలం మోహన్ లాల్ కే ఆ పాత్రకు ప్రాధాన్యత ఇచ్చారు. దానికి కారణం ఏంటో కూడా కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. జనతా గ్యారేజ్ సినిమాలో ఆ పాత్ర చాలా కీలకం. జూనియర్ ఎన్టీఆర్ కు దీటుగా ఆ పాత్ర ఉంటుంది. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ కు దీటుగా మరో తెలుగు యాక్టర్ ను పెడితే.. అంత సెట్ కాదు. అందుకే.. నాకు మోహన్ లాల్ అయితే ఆ పాత్రకు కరెక్ట్ గా సూట్ అవుతారు అనిపించింది. ఆ పాత్ర చాలా ఇంటెన్స్ ఉన్న పాత్ర. నాచురల్ గా ఉన్న పాత్ర. ఆ పాత్రలో హీరోయిజం ఉండదు. ఆ పాత్ర కొంచెం పెద్ద వయసుగా కనిపించాలి. ఇలా.. అన్నింటికీ మోహల్ లాల్ అయితేనే సెట్ అవుతారని ఆ పాత్రకు మోహన్ లాల్ ను తీసుకున్నాం.. అని కొరటాల శివ చెప్పుకొచ్చారు.

మోహన్ లాల్ కు కథ చెప్పగానే ఏమన్నారు?

నిజానికి.. మోహన్ లాల్ కు చాలామంది తెలుగు డైరెక్టర్లు కథ చెప్పి ఉంటారు. కానీ.. ఆయన ఎక్కువగా తెలుగు సినిమాలు చేయడానికి ఇష్టపడలేదు. అయితే.. కొరటాల శివ మాత్రం.. ఆయన దగ్గరికి వెళ్లి.. జనతా గ్యారేజ్ కథ చెప్పారట. దీంతో వెంటనే ఆయన కథ విని.. బాగుంది. చేసేద్దాం అన్నారట. దీంతో కొరటాల శివకు ఏం అర్థం కాలేదట. నిజానికి.. కథ చెప్పి వద్దాం అని మాత్రమే కొరటాల అనుకున్నారట. కానీ.. మోహన్ లాల్ మాత్రం ఆ పాత్రకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. అలా జనతా గ్యారేజ్ సినిమా మొదలైందట.

బాలకృష్ణకు ఆ క్యారెక్టర్ ఎందుకు ఇవ్వలేదు?

బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్.. ఇద్దరితో కలిసి సినిమా తీయడం అంటే అది పవర్ ఫుల్ కాంబినేషన్. వాళ్లిద్దరితో సినిమా తీయాలంటే.. అంతటి స్థాయి కథ ఉండాలి. జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ.. ఇద్దరూ కలిసి సినిమా చేస్తే.. సినిమా నుంచి బయటికి వస్తారు జనాలు.. బాబాయ్.. అబ్బాయి కదా.. అన్న విషయం దగ్గరే ఆగిపోతారు కానీ.. సినిమాలో ఇన్వాల్వ్ కారు. ఆడియెన్స్ ఎక్కువగా పర్సనల్ స్కేల్ లోకి వెళ్లిపోతారు. అందుకే.. అటువంటి కాంబోలో సినిమా తీయాలంటే ఇంకా పవర్ ఫుల్ కథ రాయాల్సి ఉంటుంది.. అని కొరటాల శివ చెప్పుకొచ్చారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago