అది ఏ సినిమా ఇండస్ట్రీ అయినా సరే.. దర్శకుడు కానీ.. నిర్మాత కానీ.. ముందు కథను రెడీ చేసుకుంటారు. కొన్ని కథలైతే కొన్ని హీరోల కోసమే పుడుతాయి. అది వేరే విషయం అనుకోండి. కొందరు దర్శకులు, కథా రచయితలు.. సదరు హీరోలను దృష్టిలో పెట్టుకొని కథ రాస్తుంటారు. అటువంటప్పుడు.. ఆ సినిమాకు ఆ హీరో అయితేనే కరెక్ట్ గా సూట్ అవుతారు. వేరే హీరోలకు ఆ కథ అంతగా సెట్ అవ్వదు. కానీ.. కొందరు దర్శకులు మాత్రం మంచి స్టోరీ లైన్ తో కథ రాసుకున్న తర్వాత.. ఆ కథకు ఏ హీరో సెట్ అవుతారో ఊహించుకొని.. ఆ హీరోకు కథ చెబుతారు. ఏ సినిమాకైనా ప్రారంభ దశ ఇలాగే మొదలవుతుంది. ఆ హీరో ఆ కథకు ఓకే చెబితే.. అప్పుడు ఆ సినిమా పట్టాలెక్కుతుంది.
ఒకవేళ.. ఆ హీరో.. సదరు స్టోరీ నచ్చక వద్దని చెబితే.. దర్శకుడు.. మళ్లీ మరో హీరోను ఆ సినిమా కోసం ఊహించుకుంటారు. అలా.. వేరే హీరోకు కథ చెబుతారు. ఆ హీరోకు నచ్చితే వెంటనే సినిమా పట్టాలెక్కుతుంది. ఇలా.. చాలామంది స్టార్ హీరోలు.. మంచి స్టోరీలను మిస్ చేసుకున్న సందర్భాలు బోలెడు. మంచి హిట్లను మిస్ చేసుకున్న సినిమాలు కూడా చాలా ఉన్నాయి.
ఉదాహరణకు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అతడు సినిమాను వదులుకున్నారు. డైరెక్టర్ త్రివిక్రం.. ముందు అతడు సినిమా కథను పవన్ కళ్యాణ్ కు వినిపించారు. అయితే.. పవన్ కు.. అతడు స్టోరీని చెబుతుంటే పవన్ కళ్యాణ్ నిద్రపోయారట. దీంతో.. త్రివిక్రమ్ అక్కడి నుంచి వెళ్లిపోయారట. ఆ తర్వాత అదే స్టోరీని మహేశ్ బాబుకు చెప్పడంతో.. ఆయనకు ఆ స్టోరీ నచ్చి వెంటనే ఓకే చెప్పేయడంతో సినిమా పట్టాలెక్కింది. ఆ సినిమా ఎంత సూపర్ సక్సెస్ అయిందో ప్రతి ఒక్కరికి తెలుసు. మహేశ్ బాబు కెరీర్ లోనే ది బెస్ట్ సినిమాగా నిలిచింది అది.
ఎవడు సినిమా కూడా వేరే హీరో చేతుల్లో నుంచి రామ్ చరణ్ చేతుల్లోకి
అలాగే.. మెగా పవర్ స్టార్ నటించిన ఎవడు సినిమా కూడా అలాగే.. వేరే హీరో చేతుల్లో నుంచి రామ్ చరణ్ చేతుల్లోకి వెళ్లిందట. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. అయితే.. ఎవడు సినిమా అనేది.. హాలీవుడ్ మూవీ ఫేస్ హాఫ్ అనే సినిమాకు ఇన్సిపిరేషన్ గా వచ్చిన సినిమా. అయితే.. ఈ సినిమాపై కాపీ ముద్ర ఉన్నప్పటికీ.. సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది రామ్ చరణ్, అల్లు అర్జున్. ముందు ఒక హీరోకు కథ చెప్పాక.. ఆ హీరోకు ఈ కథ నచ్చకపోవడంతో.. రామ్ చరణ్ కు వంశీ పైడిపల్లి కథ వినిపించారట. రామ్ చరణ్ కథ నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినిమా ముందుకు వెళ్లింది.
ఎవడు సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
ఎవడు సినిమాకు కావాల్సింది ఇద్దరు స్టార్ హీరోలు. అందుకే.. ఈ సినిమా కథను ముందు నందమూరి సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కు వినిపించారట. అయితే.. ఆ సినిమా స్టోరీ విన్నాక.. వాళ్లకు ఎందుకో నచ్చలేదట. అందులోనూ ఆ సమయంలో ఇద్దరూ తమ సినిమాల్లో బిజీగా ఉండటంతో.. ఆ సినిమాకు ఓకే చెప్పలేదట. దీంతో.. వెంటనే రామ్ చరణ్ కు.. వంశీ సినిమా కథను చెప్పారట. రామ్ చరణ్ ఒకే సిట్టింగ్ లో స్టోరీ నచ్చి వెంటనే ఓకే చెప్పారట. ఆ తర్వాత గెస్ట్ రోల్ కు అల్లు అర్జున్ ను తీసుకున్నారట.
అప్పట్లో సంచనాలు సృష్టించిన ఎవడు సినిమా
అయితే.. ఈ సినిమా అప్పట్లో సంచలనాలనే సృష్టించింది. సరికొత్త కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను నిర్మించడానికి 35 కోట్ల వరకు ఖర్చు కాగా.. ఈ సినిమా 60 కోట్లకు పైగా వసూలు చేసి భారీ విజయం అందుకుంది. మెగా హీరోలకు కూడా ఈ సినిమాతో మంచి పేరు వచ్చింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…