Categories: FeaturedMovie News

వందల తాగుబోతు క్యారెక్టర్లు వేసిన ఆలీ అస్సలు మందు ముట్టరట.. షాకింగ్ నిజాలు చెప్పిన ఆలీ !

కమెడియన్ అలీ.. ఆయన పేరు చెబితేనే మనకు నవ్వు వస్తుంది. ఎందుకంటే.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన టాప్ కమెడియన్. ఇప్పటికీ ఆయన టాప్ కమెడియన్ గా కొనసాగుతున్నారు. దశాబ్దాల నుంచి ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన ఇప్పటి వరకు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 1000 కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన్ను నంది అవార్డులు, ఫిలిం ఫేర్ అవార్డులు వరించాయి.

ఏపీలోని రాజమండ్రిలో పుట్టిన ఆలీ.. చాలా సాధారణమైన పేద కుటుంబంలో పుట్టారు. ఆయన ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లు లేరు. కానీ.. తనకు చిన్నప్పటి నుంచి నాటక రంగం అన్నా సినిమా రంగం అన్నా ఇష్టం. చిన్నప్పటి నుంచే ఆయన సినిమా డైలాగ్ లను మిమిక్రీలు చేస్తుండేవారు. అలా సినిమా రంగంలోకి అడుగు పెట్టారు ఆలీ.

ఆలీ మొదటి సినిమా ఇదే

కమెడియన్ ఆలీ.. 1979 లో నిండు నూరేళ్లు అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా దర్శకుడు రాఘవేంద్ర రావు. సీతాకోక చిలుక అనే సినిమా కోసం చిన్నపిల్లాడి వేషం కోసం డైరెక్టర్ భారతీ రాజా వెతుకుతున్నారని తెలిసి.. ఆలీ.. చెన్నైకి వెళ్లారు. అలా.. సీతాకోక చిలుక సినిమాలో ఆయనకు అవకాశం వచ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆలీ.. చాలా సినిమాల్లో నటించారు.

కమెడియన్ గా అవకాశం ఇచ్చిన ఎస్వీ కృష్ణారెడ్డి

నిజానికి.. ఆలీ కమెడియన్ అవుదామని ఇండస్ట్రీకి రాలేదు. నటుడు అవ్వాలని వచ్చారు. కానీ.. ఎస్వీ కృష్ణారెడ్డి.. ఆలీలోని కమెడియన్ ను చూసి ఆయనకు కమెడిన్ గా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఇక ఆయన తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అప్పటి నుంచి కమెడియన్ గా టాలీవుడ్ లో స్థిరపడిపోయారు ఆలీ.

ఆలీ ఇప్పటి వరకు మందు ముట్టలేదట

ఆలీ కమెడియన్ గా, తాగుబోతుగా చాలా సినిమాల్లో నటించారు. తాగుబోతుగా అయితే ఆలీ, బ్రహ్మానందం చాలా సినిమాల్లో నటించారు. ఆ సీన్లు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అచ్చం తాగుబోతులాగానే అలీ నటిస్తారు. తాగుబోతుగా ఆలీ నటన చూసి.. చాలామంది ఆలీ నిజంగానే మందు తాగుతాడని అనుకుంటారు. కానీ.. మనకు తెలియని విషయం ఏంటంటే.. కమెడియన్ ఆలీ తను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మందు ముట్టలేదట. తనకు మందు అలవాటే లేదట. బ్రహ్మానందం కూడా ఇప్పటి వరకు మందు ముట్టలేదంటూ కమెడియన్ ఆలీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీలో చాలామందికి మందు అలవాటు ఉంటుంది అనేది చాలా తప్పుడు ప్రచారం అని.. చాలామంది మందు ముట్టరు.. అని చెప్పుకొచ్చారు ఆలీ.

నేనైతే ఇప్పటి వరకు మందు ముట్టలేదు. బ్రహ్మానందం కూడా మందు ముట్టరు. మేము ఇద్దరం కలిసి చాలా తాగుబోతు క్యారెక్టర్లలో నటించాం. నిజానికి.. బ్రహ్మానందానికి తాగుబోతు క్యారెక్టర్ అంటేనే ఇష్టమట. కానీ.. ఇద్దరూ తాగుబోతు క్యారెక్టర్లలో జీవించేస్తారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago