Featured

ఎన్టీఆర్ బిజినెస్ లన్నీ చూసుకునేది అతనేనా ?

టాలీవుడ్ లో రాజీవ్ కనకాల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.. ఎందరో దిగ్గజ నటీనటులను తీర్చిదిద్దిన సుప్రసిద్ద దర్శకులు, నటులు, దేవదాస్ కనకాల తనయుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు రాజీవ్ కనకాల. రాజీవ్ సినిమాలలో నటించడానికి ముందు టి.వి.సీరియళ్ళలో నటించారు. ఈయన భార్య సుమ కనకాల ప్రముఖ టి.వి. యాంకర్, నటి. ఐతే మొదట్లో చిన్న చిన్న పత్రాలు చేసిన ఆయన.. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి స్కోప్ ఉన్న పాత్రలు చేయడం మొదలు పెట్టారు. అలాగే ప్రతినాయకుడి పాత్రలోనూ అయన తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.

ఒకట్రెండు సినిమాల్లో హీరోగా కూడా నటించారు. 1991లో వచ్చిన బాయ్ ‌ఫ్రెండ్ చిత్రంద్వారా తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టాడు. ఆ తరువాత రాజమౌళి దర్శకతవంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన “స్టూడెంట్ నెం.1” చిత్రంలో అద్భుతమైన పాత్రలో నటిచించి ప్రేక్షకులను మెప్పించారు. ఆ తరువాత వరుసగా నువ్వే నువ్వే, అది, విష్ణు, సై , అతడు, అతిధి, ఆ ఫిలిం బై అరవింద్, లక్ష్మి, విక్రమార్కుడు, యమదొంగ, నాన్నకు ప్రేమతో, మహర్షి, అప్పట్లో ఒకడుండేవాడు మొన్న లేటెస్టుగా సంక్రాతి బరిలో దిగిన ఎంత మంచివాడవురా అనే చిత్రం లో నటించాడు రాజీవ్ కనకాల. అయితే రాజీవ్ కనకాల, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఎన్టీఆర్ నటించిన దాదాపు అన్ని చిత్రాలలో రాజీవ్ కనకాల ఎదో ఒక పాత్రలో నటిస్తుంటాడు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నంబర్ 1 సినిమాలో ప్రముఖ యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల విలన్ పాత్రలో నటించాడు.

ఈ సినిమాతో ఎంత పెద్ద ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే.. అయితే ఈ సినిమా తరువాత రాజీవ్ కనకాలకు మంచి గుర్తింపు వచ్చింది. ఆపై వరుసగా అవకాశాలు వచ్చాయి. ఒకానొక సమయంలో చాలా బిజీ ఆర్టిస్ట్ అయిపోయారు. అయితే ఏమయిందో తెలియదు కానీ క్రమంగా బుల్లితెర మీద కనిపించడం తగ్గించేసారు రాజీవ్ కనకాల. కానీ ఎన్టీఆర్ నటించిన పలు సినిమాల్లో మాత్రం కీలకపాత్రలు పోషించాడు. ఇక స్టూడెంట్ నెం.1 సినిమా తరువాత నుంచి ఎన్టీఆర్, రాజీవ్ కనకల ఇద్దరి మధ్య బాండింగ్ ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇద్దరు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు.

ఈ క్రమంలో ఎన్టీఆర్ కు సంబంధించిన పలు వ్యాపారాలు సైతం రాజీవ్ కనకాల చూసుకుంటాడని ఫిలింనగర్ వర్గాలు చెప్పుకుంటారు. అయితే ఆ బిజినెస్ లు ఏంటనేవి మాత్రం బయటికి తెలియదు. ఎన్టీఆర్ కు సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటూ మరికొన్ని వ్యాపార లావాదేవీలను రాజీవ్ కనకాల దగ్గరుండి చూసుకుంటాడని అంటారు. ఒక వైపు బిజినెస్ చూసుకుంటూనే మరో వైపు సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తున్నారు రాజీవ్ కనకాల. తాజగా విక్టరీ వెంకటేష్, ప్రియమణి హీరో హీరోయిన్లుగా వస్తున్నా నారప్ప సినిమాలో హీరోయిన్ ప్రియమణికి అన్నగా రాజీవ్ కనకాల నటిస్తున్నాడని సమాచారం.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పిల్లలకు బెస్ట్ హెల్తీ స్వీట్ ఐడియా ఇదే.. పాలు, బెల్లంతో సూపర్ టేస్ట్.. సింపుల్ హోమ్ రెసిపీ!

ఇంట్లోనే తక్కువ పదార్థాలతో, ఆరోగ్యానికి మేలు చేసే స్వీట్లు తయారు చేయడం ఇటీవలి కాలంలో మళ్లీ ట్రెండ్‌గా మారుతోంది. ముఖ్యంగా…

3 hours ago

నిద్రలో లేచి తింటున్నారా? సాధారణమా లేక ఆరోగ్య సమస్యా?

అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా ఆకలి వేయడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ అనుభవం. రోజంతా సరైన సమయానికి భోజనం చేసినప్పటికీ…

3 hours ago

వేసవిలో శరీరానికి కూలింగ్ కావాలా?దాహం, అలసటకు పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇదే!

వేసవి మొదలైనప్పుడే శరీరం చల్లదనం కోసం తపిస్తుంది. ఈ కాలంలో మార్కెట్‌లో లభించే పండ్లలో మామిడి, పుచ్చకాయ ప్రత్యేక స్థానం…

4 hours ago

ఖాళీ కడుపుతో వాకింగ్.. నిజంగా మంచిదేనా?

దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత కనిపిస్తున్న నేపథ్యంలో చాలా మంది తమ…

4 hours ago

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

2 days ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

2 days ago