టాలీవుడ్ లో రాజీవ్ కనకాల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.. ఎందరో దిగ్గజ నటీనటులను తీర్చిదిద్దిన సుప్రసిద్ద దర్శకులు, నటులు, దేవదాస్ కనకాల తనయుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు రాజీవ్ కనకాల. రాజీవ్ సినిమాలలో నటించడానికి ముందు టి.వి.సీరియళ్ళలో నటించారు. ఈయన భార్య సుమ కనకాల ప్రముఖ టి.వి. యాంకర్, నటి. ఐతే మొదట్లో చిన్న చిన్న పత్రాలు చేసిన ఆయన.. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి స్కోప్ ఉన్న పాత్రలు చేయడం మొదలు పెట్టారు. అలాగే ప్రతినాయకుడి పాత్రలోనూ అయన తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.

ఒకట్రెండు సినిమాల్లో హీరోగా కూడా నటించారు. 1991లో వచ్చిన బాయ్ ఫ్రెండ్ చిత్రంద్వారా తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టాడు. ఆ తరువాత రాజమౌళి దర్శకతవంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన “స్టూడెంట్ నెం.1” చిత్రంలో అద్భుతమైన పాత్రలో నటిచించి ప్రేక్షకులను మెప్పించారు. ఆ తరువాత వరుసగా నువ్వే నువ్వే, అది, విష్ణు, సై , అతడు, అతిధి, ఆ ఫిలిం బై అరవింద్, లక్ష్మి, విక్రమార్కుడు, యమదొంగ, నాన్నకు ప్రేమతో, మహర్షి, అప్పట్లో ఒకడుండేవాడు మొన్న లేటెస్టుగా సంక్రాతి బరిలో దిగిన ఎంత మంచివాడవురా అనే చిత్రం లో నటించాడు రాజీవ్ కనకాల. అయితే రాజీవ్ కనకాల, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఎన్టీఆర్ నటించిన దాదాపు అన్ని చిత్రాలలో రాజీవ్ కనకాల ఎదో ఒక పాత్రలో నటిస్తుంటాడు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నంబర్ 1 సినిమాలో ప్రముఖ యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల విలన్ పాత్రలో నటించాడు.

ఈ సినిమాతో ఎంత పెద్ద ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే.. అయితే ఈ సినిమా తరువాత రాజీవ్ కనకాలకు మంచి గుర్తింపు వచ్చింది. ఆపై వరుసగా అవకాశాలు వచ్చాయి. ఒకానొక సమయంలో చాలా బిజీ ఆర్టిస్ట్ అయిపోయారు. అయితే ఏమయిందో తెలియదు కానీ క్రమంగా బుల్లితెర మీద కనిపించడం తగ్గించేసారు రాజీవ్ కనకాల. కానీ ఎన్టీఆర్ నటించిన పలు సినిమాల్లో మాత్రం కీలకపాత్రలు పోషించాడు. ఇక స్టూడెంట్ నెం.1 సినిమా తరువాత నుంచి ఎన్టీఆర్, రాజీవ్ కనకల ఇద్దరి మధ్య బాండింగ్ ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇద్దరు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు.

ఈ క్రమంలో ఎన్టీఆర్ కు సంబంధించిన పలు వ్యాపారాలు సైతం రాజీవ్ కనకాల చూసుకుంటాడని ఫిలింనగర్ వర్గాలు చెప్పుకుంటారు. అయితే ఆ బిజినెస్ లు ఏంటనేవి మాత్రం బయటికి తెలియదు. ఎన్టీఆర్ కు సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటూ మరికొన్ని వ్యాపార లావాదేవీలను రాజీవ్ కనకాల దగ్గరుండి చూసుకుంటాడని అంటారు. ఒక వైపు బిజినెస్ చూసుకుంటూనే మరో వైపు సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తున్నారు రాజీవ్ కనకాల. తాజగా విక్టరీ వెంకటేష్, ప్రియమణి హీరో హీరోయిన్లుగా వస్తున్నా నారప్ప సినిమాలో హీరోయిన్ ప్రియమణికి అన్నగా రాజీవ్ కనకాల నటిస్తున్నాడని సమాచారం.
































