Categories: FeaturedMovie News

ఎన్టీఆర్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో టాంక్‌బండ్‌లో దూకిన నిర్మాత ఎవరో తెలుసా?

ఇండస్ట్రీలో సినిమా హిట్ ఫ్లాప్ అన్నది సహజమే. ఇది ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమాలు మాత్రమే కాదు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సహా హాలీవుడ్ సినిమాలు కొన్ని సందర్భాలలో భారీ హిట్, భారీ డిజాస్టర్ అయినవి లెక్కకుమించి చాలానే ఉన్నాయి. అయితే సినిమా హిట్ అయినప్పుడు నిర్మాతకి ఎన్ని కోట్లు లాభాలు వస్తాయో వాటితో తర్వాత ఏ స్టార్ హీరోతో ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తాడో అనే విషయంలో చాలా ఊహాగానాలు ఉంటాయి. అదే సినిమా గనక ఫ్లాపయితే ఆ నిర్మాత వెనక వేలకోట్ల ఆస్థులుంటేనో, వెనకాల బడా వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకుల అండ ఉంటేనో మళ్ళీ సినిమాలు చేసే ప్లాన్ చేసుకుంటాడు.

ఇక సురేష్ బాబు, నాగార్జున, దిల్ రాజు లాంటి నిర్మాతలైతే నాలుగు సినిమాలు ఫ్లాపయినా పెద్ద తేడా ఉండదు. అయితే చాలా తక్కువ సందర్భాలలో ఒక భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమా ఫ్లాపయితే ఆ నిర్మాత క్షణికావేశంలో చనిపోవడానికి కూడా ఆలోచించడు. ఇలాంటి ఒక సంఘటన యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సినిమా విషయంలో జరిగింది. నిన్ను చూడాలని సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన నందమూరి వారసుడు నటనలో తాతను మించిన నటుడు అనిపించుకున్న జూనియర్ ఎన్.టి.ఆర్ స్టూడెంట్ నంబర్ 1తో భారీ హిట్ అందుకున్నాడు.

ఆయనకి ఆది, సింహాద్రి లాంటి ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నాడు. టాలీవుడ్‌లో ఒక్కసారిగా పెద్ద హీరోలతో సమానంగా స్టేట్స్ సాధించాడు. దాంతో పెద్ద పెద్ద నిర్మాతలు జూనియర్ ఎన్.టి.ఆర్‌తో సినిమా చేసేందుకు క్యూ కట్టారు. వారిలో చెంగళ వెంకట్రావు ఒకరు. ఈయన అంతక ముందు నందమూరి బాలకృష్ణ – బి.గోపాల్ కాంబినేషన్‌లో సమరసింహా రెడ్డి సినిమాను నిర్మించారు. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో నిర్మించిన ఈ సినిమా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఊహించని విధంగా భారీ లాభాలను అందుకున్నాడు ఈ నిర్మాత. రాజకీయనాయకుడు సినిమా పరిచయాలతో నెక్స్ట్ సినిమాను బి.గోపాల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్.టి.ఆర్ హీరోగా ప్లాన్ చేశాడు. ఆ సినిమానే నరసింహుడు. సమీరా రెడ్డి, అమీషా పటేల్ హీరోయిన్స్‌గా నటించారు. ఆర్తీ అగర్వాల్ స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. ఈ సినిమా నిర్మాణం దాదాపు సంవత్సరం పాటు సాగింది. ముందు అనుకున్న బడ్జెట్ ఒకటైతే నిర్మాత కన్ను మిన్నూ కానకుండా కేవలం ఎన్.టి.ఆర్‌కి ఉన్న క్రేజ్‌తో లెక్కకు మించి బడ్జెట్ ఖర్చు చేశాడు.

అయితే సినిమా ఫైనల్ కాపీ చూసుకున్నప్పుడే ఆడదనే మాట అందరూ చెప్పారు. అయినా డిస్ట్రిబ్యూటర్స్‌కి నమ్మకం కలిగించి సినిమాను అమ్మేశాడు. తీరా సినిమా రిలీజై మార్నింగ్ షోకే ఫ్లాప్ అని టాక్ వచ్చింది. దాంతో పెట్టిన పెట్టుబడిలో 20 శాతం కూడా తిరిగి రాలేదు. అంతే డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఒత్తిడి మొదలైంది. భారీ నష్టాలు తప్పదని ఆ నష్టాలను పూడ్చే దారిలేక నిర్మాత చెంగల వెంకట్రావు హైదరాబాద్ టాంక్‌బడ్‌లో దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఎట్టకేలకి అక్కడివారు చూసి కాపాడడంతో ప్రాణాలతో బయటపట్టాడు. ఆ సమయంలో ఈ సినిమాకి సంబంధించిన రక రకాల వార్తలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చాయి. హీరో ఎన్.టి.ఆర్ ఈ వార్తలపై స్పందించాడు. అంతేకాదు అంత బడ్జెట్ పెట్టమని, బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ కావాలని ఎన్.టి.ఆర్ అడిగాడా..? అంటూ ఫైర్ అయ్యాడు. అదే సమయంలో నిర్మాతకి అండగా నిలిచి ఆయన తీసుకున్న రెమ్యునరేషన్‌లో 6 కోట్లవరకు తిరిగి ఇచ్చేశాడని చెప్పుకున్నారు. ఏదేమైనా ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు అడ్రెస్ లేడు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago