ఇండస్ట్రీలో సినిమా హిట్ ఫ్లాప్ అన్నది సహజమే. ఇది ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమాలు మాత్రమే కాదు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సహా హాలీవుడ్ సినిమాలు కొన్ని సందర్భాలలో భారీ హిట్, భారీ డిజాస్టర్ అయినవి లెక్కకుమించి చాలానే ఉన్నాయి. అయితే సినిమా హిట్ అయినప్పుడు నిర్మాతకి ఎన్ని కోట్లు లాభాలు వస్తాయో వాటితో తర్వాత ఏ స్టార్ హీరోతో ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తాడో అనే విషయంలో చాలా ఊహాగానాలు ఉంటాయి. అదే సినిమా గనక ఫ్లాపయితే ఆ నిర్మాత వెనక వేలకోట్ల ఆస్థులుంటేనో, వెనకాల బడా వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకుల అండ ఉంటేనో మళ్ళీ సినిమాలు చేసే ప్లాన్ చేసుకుంటాడు.

ఇక సురేష్ బాబు, నాగార్జున, దిల్ రాజు లాంటి నిర్మాతలైతే నాలుగు సినిమాలు ఫ్లాపయినా పెద్ద తేడా ఉండదు. అయితే చాలా తక్కువ సందర్భాలలో ఒక భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమా ఫ్లాపయితే ఆ నిర్మాత క్షణికావేశంలో చనిపోవడానికి కూడా ఆలోచించడు. ఇలాంటి ఒక సంఘటన యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సినిమా విషయంలో జరిగింది. నిన్ను చూడాలని సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన నందమూరి వారసుడు నటనలో తాతను మించిన నటుడు అనిపించుకున్న జూనియర్ ఎన్.టి.ఆర్ స్టూడెంట్ నంబర్ 1తో భారీ హిట్ అందుకున్నాడు.

ఆయనకి ఆది, సింహాద్రి లాంటి ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నాడు. టాలీవుడ్‌లో ఒక్కసారిగా పెద్ద హీరోలతో సమానంగా స్టేట్స్ సాధించాడు. దాంతో పెద్ద పెద్ద నిర్మాతలు జూనియర్ ఎన్.టి.ఆర్‌తో సినిమా చేసేందుకు క్యూ కట్టారు. వారిలో చెంగళ వెంకట్రావు ఒకరు. ఈయన అంతక ముందు నందమూరి బాలకృష్ణ – బి.గోపాల్ కాంబినేషన్‌లో సమరసింహా రెడ్డి సినిమాను నిర్మించారు. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో నిర్మించిన ఈ సినిమా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఊహించని విధంగా భారీ లాభాలను అందుకున్నాడు ఈ నిర్మాత. రాజకీయనాయకుడు సినిమా పరిచయాలతో నెక్స్ట్ సినిమాను బి.గోపాల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్.టి.ఆర్ హీరోగా ప్లాన్ చేశాడు. ఆ సినిమానే నరసింహుడు. సమీరా రెడ్డి, అమీషా పటేల్ హీరోయిన్స్‌గా నటించారు. ఆర్తీ అగర్వాల్ స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. ఈ సినిమా నిర్మాణం దాదాపు సంవత్సరం పాటు సాగింది. ముందు అనుకున్న బడ్జెట్ ఒకటైతే నిర్మాత కన్ను మిన్నూ కానకుండా కేవలం ఎన్.టి.ఆర్‌కి ఉన్న క్రేజ్‌తో లెక్కకు మించి బడ్జెట్ ఖర్చు చేశాడు.

అయితే సినిమా ఫైనల్ కాపీ చూసుకున్నప్పుడే ఆడదనే మాట అందరూ చెప్పారు. అయినా డిస్ట్రిబ్యూటర్స్‌కి నమ్మకం కలిగించి సినిమాను అమ్మేశాడు. తీరా సినిమా రిలీజై మార్నింగ్ షోకే ఫ్లాప్ అని టాక్ వచ్చింది. దాంతో పెట్టిన పెట్టుబడిలో 20 శాతం కూడా తిరిగి రాలేదు. అంతే డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఒత్తిడి మొదలైంది. భారీ నష్టాలు తప్పదని ఆ నష్టాలను పూడ్చే దారిలేక నిర్మాత చెంగల వెంకట్రావు హైదరాబాద్ టాంక్‌బడ్‌లో దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఎట్టకేలకి అక్కడివారు చూసి కాపాడడంతో ప్రాణాలతో బయటపట్టాడు. ఆ సమయంలో ఈ సినిమాకి సంబంధించిన రక రకాల వార్తలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చాయి. హీరో ఎన్.టి.ఆర్ ఈ వార్తలపై స్పందించాడు. అంతేకాదు అంత బడ్జెట్ పెట్టమని, బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ కావాలని ఎన్.టి.ఆర్ అడిగాడా..? అంటూ ఫైర్ అయ్యాడు. అదే సమయంలో నిర్మాతకి అండగా నిలిచి ఆయన తీసుకున్న రెమ్యునరేషన్‌లో 6 కోట్లవరకు తిరిగి ఇచ్చేశాడని చెప్పుకున్నారు. ఏదేమైనా ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు అడ్రెస్ లేడు.
































