Featured

Murali Mohan : ఏఎన్నార్, చిరంజీవి, నాగార్జున, అందరం కలిసి ఒక్క ఫోటో అడిగితే టైం లేదని వెళ్ళిపోయారు వైయస్ రాజశేఖర్ రెడ్డి.. ఆరోజు చాలా అవమానంగా ఫీల్ అయ్యాం.. : మురళీ మోహన్

Murali Mohan : వ్యాపారం నుండి నటన మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మురళీ మోహన్ గారు ‘జగమే మాయ’ సినిమాతో పరిచయమై అనతి కాలంలోనే హీరోగా అనేక చిత్రాల్లో నటించారు. ఇండస్ట్రీలో హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన అటు పాలిటిక్స్ లోకి వచ్చి అక్కడ తనదైన ముద్ర వేశారు. ఇక సినిమా నిర్మాణంలో అడుగుపెట్టి జయభేరి బ్యానర్ స్థాపించి పలు చిత్రాలను నిర్మించిన ఆయన ఈ మద్య కాలంలో సినిమాలను తగ్గించినా ఆయన పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమా రంగంలోని అనేక విషయాల గురించి అలాగే ఆయన రాజకీయాల గురించి మాట్లాడారు.

మా అసోసియేషన్ కు బిల్డింగ్ సీఎం పదవిలోకి వచ్చిన ఏ నాయకుడు ఆలోచించలేదంటూ చెప్పారు. హైదరాబాద్ కు సినిమా ఇండస్ట్రీ తరలి రావడానికి దాదాపు 10 ఏళ్ళ పైనే పట్టిందంటూ తెలిపారు. ఇక భూమి ఇస్తే మా బిల్డింగ్ కడదామని అనుకుంటే ఏ సీఎం ఇవ్వలేదు. అన్నపూర్ణ స్టూడియోస్ కి రామానాయుడు స్టూడియోస్ కి మధ్యలో కొంత భూమి ఏదైనా సినిమా ఇండస్ట్రీ అవసరాల కోసం వాడుకొమ్మని ప్రభుత్వం తెలిపినా శాంక్షన్ చేయలేదు. అటు ఇస్తామని చెప్పకుండా ఇవ్వనని చెప్పకుండా చాలా ఏళ్ళు చేయడం వల్ల మా బిల్డింగ్ నిర్మాణం జాప్యమైంది.

ఇక ఎన్టీఆర్ సీఎం అయినా, చంద్రబాబు సీఎం అయినా మా బిల్డింగ్ కి భూమి శాంక్షన్ చేయలేదు. రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి సినిమా పెద్దలందరూ వెళ్ళినపుడు నేను రానని చెప్పినా తీసుకెళ్లారు. ఆయనకు నన్ను చూస్తే నచ్చదు టీడీపీ వాడినని అందుకే వద్దని చెప్పినా వినకుండా మా అసోసియేషన్ ప్రెసిడెంట్ లేకుండా ఎలా వెళ్తాము అని పిలుచుకుపోయారు. నాగేశ్వరావు గారు, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున మొదలగు అందరూ అగ్ర హీరోలు వెళ్లగా రాజశేఖర్ రెడ్డి గారు మురళీ మోహన్ ఉన్నాడుగా ఇంకా ప్రభుత్వం భూమి ఇవ్వడం ఎందుకు తనని అడగండి అంటూ నవ్వాడు. ఇక ఇవ్వడని అక్కడున్న వాళ్లందరికీ అర్థమై దాదాపు ముప్పై మంది సినిమా వాళ్ళం వెళ్లగా అందరం కలిసి ఒక ఫోటో తీసుకుందామని అడిగితే ఆయన ఏమాత్రం ఆలోచించకుండా నాకు టైం లేదని వెళ్ళిపోయాడు. అపుడు అందరం చాలా అవమానంగా ఫీల్ అయ్యాము అంటూ చెప్పారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

8 hours ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

8 hours ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

8 hours ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

8 hours ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

8 hours ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

9 hours ago