ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనాకు సంబంధించి తొలి డెల్టా ప్లస్ కేసు నమోదైంది. ఈ మేరకు మంత్రి ఆళ్లనాని ఈ విషయాన్ని మీడియాతో వెల్లడించారు. తిరుపతిలో డెల్టా ప్లస్ కేసు వచ్చిందని ఈ అయన తెలిపారు. ‘‘డెల్టా ప్లస్ సోకిన వ్యక్తికి చికిత్స కూడా పూర్తయింది. డెల్టా ప్లస్ సోకిన వ్యక్తి నుంచి ఎవరికీ వ్యాపించలేదు. బ్లాక్ ఫంగస్, డెల్టా ప్లస్ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. థర్డ్ వేవ్ వచ్చిన ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉండాం’’ అని ఆళ్లనాని పేర్కొన్నారు.
డెల్టా వేరియంట్ మన దేశంలో సెకండ్ వెవ్ కారణం అయ్యింది. దురదృష్టవశాత్తు అదే ఇప్పుడు మ్యూటేషన్ చెంది డెల్టాప్లస్ వేరియంట్‌గా కొత్త రంగు పులుముకుంది. ప్రస్తుతం మన దేశంలో ఈ వేరియంట్‌కు చెందిన కేసులు నమోదవుతున్నాయి.
మన దేశంలో ఇప్పటివరకు 40కి పైగా డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మహా రాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే కర్ణాటక, తమిళ నాడు, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో కూడా డెల్టా ప్లస్ కేసులు మొదలయ్యాయి. డెల్టా వేరియంట్ మాదిరిగా అత్యంత వేగంగా వ్యాప్తి చెందడం దీని లక్షణం, అదే విధంగా దక్షిణాఫ్రికా వేరియంట్ లానే టీకాల నుంచి తప్పించుకునే లక్షణం ఈ డెల్టా ప్లస్ కు ఉందని అందువల్ల అందరూ దీనిపై జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…