కైకాల సత్యనారాయణ.. 45 సంవత్సరాలుగా తెలుగు చిత్ర రంగానికి సేవ చేస్తున్న తెలుగు సినీ నటుడు, మాజీ భారత పార్లమెంటు సభ్యుడు. ఇప్పటి వరకూ 777కు పైగా చిత్రాలలో నటించాడు. ఒక నటుడిగా పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలన్నిటిలోనూ నటించి తన నట విశ్వరూపాన్ని చూపించాడు. నాటి తరం హీరోగా, కమెడియన్ గా, విలన్ గా ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించాడు. తాను పోషించిన వైవిద్యమైన పాత్రలకు గుర్తుగా ఆయన ‘నవరస నటనా సార్వభౌమ’ అనే బిరుదును కూడా సంపాదించుకున్నాడు.
మన దక్షిణాది సినీ పరిశ్రమ గర్వపడే సినిమాలలో ఒక్కటి K.G.F. కన్నడ నటుడు, రాకింగ్ స్టార్ యాష్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు. తెలుగులో ఈ చిత్రాన్ని అప్పట్లో సాయి కొర్రపాటి, విజయ్ కిరగందూర్‌లతో పాటు కైకాల సత్యనారాయణ సమర్పించు అంటూ టైటిల్స్ లో వేసారు. దీనికి కారణం అయన వారసుడు..
ఈ చిత్రానికి కన్నడలో సహా నిర్మాతగా పని చేసిన కైకాల సత్య నారాయణ కుమారుడు, ముందుగా ఈ చిత్ర విజయాన్ని ఊహించి తెలుగులో ఈ చిత్రానికి సంబంధించిన హక్కులు తానే తీసుకొని టాలీవుడ్ లో విడుదల చేసి కాసుల వర్షం కురిపించుకున్నాడు. అయితే టాలీవుడ్ లో ఈ చిత్రానికి ఈయనతో పాటూ సాయికోర్రపాటి కూడా సహనిర్మాతగా వ్యవహరించారు. ఈవిధంగా ఒక్క టాలీవుడ్ లోనే ఈ సినిమా సుమారు 18 కోట్ల రూపాయిల షేర్ వసూలు చేసిందంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఆ సినిమా సమయంలో కైకాల సత్యనారాయణ కు కేజీఎఫ్ చిత్ర యూనిట్ సన్మానం కూడా జరిపారు. ఈ చిత్రం తర్వాత ఆయన వెంటనే ‘K.G.F చాప్టర్ 2’ కి కూడా కన్నడలో సహా నిర్మాతగా పని చేస్తున్నాడు. భవిష్యత్తులో కైకాల సత్యనారాయణ కుమారుడు టాలీవుడ్ లోని సూపర్ స్టార్స్ అందరితోనూ సినిమాలు తియ్యడానికి సిద్ధమౌతున్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…