టాలీవుడ్ టాప్ డైరెక్టర్ జక్కన్న దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మొట్టమొదటి చిత్రం “ఛత్రపతి”. 2005వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బ్లాస్టర్ విజయంగా నిలిచింది. సుమారు 16 సంవత్సరాల తర్వాత ఈ సినిమా తిరిగి బాలీవుడ్ ఇండస్ట్రీలో రీమేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
“ఛత్రపతి” రీమేక్ సినిమా ద్వారా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు రాజమౌళి సమక్షంలో ఈ సినిమా ఎంతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. “ఛత్రపతి” సినిమాను రీమేక్ ను వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ సరసన హీరోయిన్ పాత్రలో నటించడం కోసం చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించడానికి రెజీనా
కసాండ్రా పేరు వినిపిస్తోంది. ఇప్పటికే ఈ బ్యూటీ బాలీవుడ్ లోకి “ఏక్ లడ్‌కీ కో దేఖా తో ఐసా లగా” సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక “ఛత్రపతి”సినిమాకు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే తనకు ఇది రెండవ బాలీవుడ్ చిత్రం అని చెప్పవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…