జూనియర్ ఎన్టీఆర్.. నందమూరి తారక రామారావు.. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ రూపాన్ని అందిపుచ్చుకొని.. ఆయన మళ్లీ పుట్టారా? అన్నట్టుగా సినిమాల్లో రాణిస్తూ తనను తాను నిరూపించుకున్నారు ఎన్టీఆర్. నందమూరి ఫ్యామిలీ నుంచి ఎందరో హీరోలు వచ్చినా కూడా ఎవ్వరూ జూనియర్ ఎన్టీఆర్ స్థాయికి ఎదగలేదు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ.. ఆ తర్వాత మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కు ఉన్న క్రేజే వేరు.
ఇక చిన్న వయస్సులోనే టాలీవుడ్ లో అడుగుపెట్టి, హీరోగా అందులోనూ పౌరాణిక పాత్రలో నటించి, అందరినీ మెప్పించి అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఘనత కూడా ఎన్టిఆర్ కే చెందుతుంది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం చిత్రంలో ఎన్టిఆర్ రాముడి పాత్రలో అద్భుతంగా నటించాడు. అయితే ఎన్టిఆర్ తో పాటూ సీతగా నటించిన స్మితా మాధవ్ కూడా తన నటనతో అందరినీ అలరించింది. అయితే బాల రామాయణం సినిమా తరువాత స్మితా మాధవ్ మళ్ళీ ఏ సినిమాలోనూ నటించలేదు.
అయితే ఎన్టిఆర్ మాత్రం హీరోగా ‘చూడాలని ఉంది’ సినిమాతో వచ్చి.. వరుస విజయాలతో టాప్ స్టార్ గా కొనసాగుతున్నాడు. అయితే సీతగా నటించిన స్మితా మాధవ్ మాత్రం తనకి ఎంతగానో ఇష్టమైన డాన్స్ వైపు అడుగులు వేసింది, ఇక అందులో పూర్తి ప్రావిణ్యం సంపాదించింది. అంతే కాదు డాన్సర్ గా అనేక స్టేజ్ లపై తన నాట్య ప్రావీణ్యాన్ని చూపించింది.
అంతే కాకుండా కొన్ని సినిమా పాటలకు డాన్స్ కంపోజ్ చేసింది. ఇక మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా తన డాన్స్ ప్రోగ్రామ్స్ తో అలరిస్తోంది. అంతేకాదు, ఎంతోమందికి డ్యాన్స్ నేర్పిస్తూ.. తన శిష్యులను కూడా దగ్గరుండి డాన్స్ షోలలో ఆరంగేట్రం చేయిస్తోంది.
హిందూ సంప్రదాయాల్లో తులసి మొక్కకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అదే విధంగా తులసి మాలతో సంబంధించిన ఆచారాలు కూడా భక్తుల్లో…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ…
ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం భక్తి ఉత్సాహం నడుమ నిర్వహించే సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవం…
వేసవి కాలం ప్రారంభమైతే శరీరంలో వేడి పెరగడం సహజం. అయితే అదే సమయంలో చాలా మందిని వేధించే సమస్యలు ఏంటంటే—ఆసిడిటీ,…
ఇంటి నిర్మాణంలో ప్రతి అంశానికి ప్రాధాన్యం ఉన్నట్లే, పూజా గది స్థానం కూడా చాలా ముఖ్యమని నమ్మకం. హిందూ సంప్రదాయంలో…